తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వసుంధర షాపింగ్ మాల్ అధినేత తాటిపల్లి శంకర్ బాబు ఏర్పాటుచేసిన గణేష్ మండపాన్ని సందర్శించిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు యాదవ్* గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కొత్తగూడెం మెయిన్ రోడ్డులో వసుంధర షాపింగ్ మాల్ ప్రక్కన తాటిపల్లి శంకర్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు యాదవ్ సందర్శించి గణనాథుని ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఘ్నాలను తొలగించే వినాయకుని ఆశీస్సులతో కొత్తగూడెం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ