తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవ కార్యక్రమం. భారతీయ జనతా పార్టీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా సత్యసాయి ఆశ్రమంలో సేవా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆశ్రమంలోని వారికి పండ్లు పంపిణీ చేసి, అనంతరం ఆశీర్వాద దీపం వెలిగించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి ఆయురారోగ్యాలు, సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని ప్రార్థించారు.దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషికి గుర్తుగా ఆయన జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో నిర్వహిస్తున్నామని శీలం విద్యాసాగర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శులు చంద్రగిరి రమేష్, కళ్యాణ్ కర్ రాజశేఖర్, జిల్లా సీనియర్ నాయకులు నోముల రమేష్, కనుకుంట్ల రాజమొగిలి, శ్రీనివాస్, రాయుడు నాగేశ్వరరావు, కొత్తూరు శ్రీనివాస్, కొయ్యడ శ్రీనివాస్ మహిళా నాయకులు బొండుగుల యామిని, గూడా విజయ భూక్యా పూర్ణ, నిదానపల్లి అలివేలు, హాసిని, పట్టణ నాయకులు భాస్కర్ గౌడ్, గిరి, రవి కార్యకర్తలు మోడీ అభిమానులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ