Wednesday, 16 September 2026 09:47:49 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

రాష్ట్ర మంత్రివర్గంలో లంబాడీ ఎమ్మెల్యేలకు చోటు కల్పించాలి..1000 మంది తో ది.30/5/2025 నా నిరసన తెలుపుతాము : సేవాలాల్ బంజారా సంఘం. ప్రసాద్ నాయక్

Date : 29 May 2025 10:40 AM Views : 822

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాష్ట్ర మంత్రివర్గంలో లంబాడీ ఎమ్మెల్యేలకు చోటు కల్పించాలి లేదంటే గాందీ భవనం వద్ద 1000 మంది తో 30/5/2025 నా నిరసన తెలుపుతాము. ది. 28-05-2025 నాడు కొత్తగూడెం జిల్లా పట్టణంలో సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లావుడియా ప్రసాద్ నాయక్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భానోత్ శ్రీనివాస్ నాయక్ లో ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ బంజారా సంఘం తేదీ 30-05-2025 రోజున హైదరాబాద్ లో గాంధీ భవనం కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం అన్ని సంఘాల నుంచి ఉంటుంది అని తెలంగాణ రాష్ట్రంలో రేపు జరగనున్న మంత్రివర్గ విస్తరణ లో కాంగ్రెస్ పార్టీ లంబాడ సామాజిక వర్గ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి లంబాడా సామాజిక వర్గ ఓట్లు అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీకి వేయడం వల్ల అధికారంలోకి వచ్చిందని అని అన్నారు. రాష్ట్రంలో దాదాపు 45 నియోజకవర్గాల్లో లంబడీ లు పేద్ద సంఖ్యలో ఉన్నారు .అలాంటి లంబాడ సామాజిక వర్గానికి ఇప్పటివరకు మంత్రివర్గంలోకి స్థానం కల్పించకుండా కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తుందని చెప్పారు. అగ్రకులాలకు మాత్రమే రాజకీయ అవకాశాలు కల్పిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం లంబడీ సామాజికవర్గానికి పూర్తిగా విస్మరించింది ఇప్పటికైనా రేపు జరగనున్న మంత్రివర్గ విస్తరణలో లంబాడ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని కోరారు లేకుంటే తీవ్ర వ్యతిరేకత చవిచూడాల్సి వస్తుందని రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని లంబాడ సామాజిక వర్గం బహిష్కరిస్తుందని రాష్ట్రవ్యాప్తంగా లంబాడ సామాజిక వర్గం ఒక్కతాటిపై వచ్చి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తుందని ఇప్పటికైనా లంబాడ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలి లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ బంజారా సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు నునావత్ రాంబాబు నాయక్, రాష్ట్ర కోశాధికారి భుక్యా రవికుమార్ నాయక్, రాష్ట్ర కార్యదర్శి బట్టు వీరన్న నాయక్, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి బోడ శ్రీనివాస్ నాయక్, జిల్లా కార్యదర్శి బోడ మంగ నాయక్, గౌరవ అధ్యక్షులు రమేష్ నాయక్ గుగులోతు బాలు నాయక్ జిల్లా ఉపాధ్యక్షుడు హరీష్ నాయక్ జిల్లా కార్యదర్శి ధారావత్ నాగరాజు నాయక్, జి రమేష్ నాయక్, బి అఖిల్ నాయక్, నాగేష్ బి నాగేష్ నాయక్, బి చైతన్య నాయక్, బి చరణ్ నాయక్, బి మహేష్ నాయక్, బి అర్జున్ నాయక్, టి లక్ష్మణ్ నాయక్, జానకిరామ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :