తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో మావోయిస్టు పార్టీకి చెందిన అగ్ర నాయకులు ఉన్నట్లు సమాచారం. మరికొంత మంది మావోయిస్టులు ఎదురు కాల్పుల్లో తీవ్ర గాయాలతో తప్పించుకున్నారు. తప్పించుకున్న మావోయిస్టుల ఆచూకీ కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నారు. ఘటనా స్థలంలో ఆయుధాలు, పేలుడు సామాగ్రి లభ్యమయ్యాయి.
Admin
తెలుగు వెలుగు టీవీ