Friday, 18 September 2026 11:55:39 AM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా చేపడుతున్న జలశక్తి అభియాన్ కార్యక్రమం : కేంద్ర నోడల్ అధికారి ఆసిఫ్ ఇస్మాయిల్ ఖాన్.

Date : 06 August 2024 08:43 PM Views : 565

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మంగళవారం ఐడిఓసి సమావేశం మందిరంలో జలశక్తి అభియాన్ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ , డాక్టర్ శ్రీనివాస్ విట్టల్ టెక్నికల్ ఆఫీసర్ రాష్ట్ర జల శక్తి అభియాన్ , జిల్లా అధికారు లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశం లో ముందుగా జిల్లా కలెక్టర్ జలశక్తి అభియాన్ కార్యక్రమం లో భాగంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మరియు తీసుకుంటున్న చర్యలు గురించి పవర్ పాయింట్ ప్రజెంటెషెన్ ద్వారా వ్యసాయ, ఉద్యనవన, ఇరిగేషన్, గ్రామీణభివృద్ధి, తాగునిరు, భూగర్భజలాలు, మహిళసంఘాలు తదితర అంశాలపై కేంద్ర సభ్యులకు వివరించారు. అనంతరం కేంద్ర సభ్యులు మాట్లాడుతూ క్యాచ్ థ రైన్ వెన్ ఇట్ ఫాల్స్ అంశం పై కేంద్రం ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం తీసుకోవాల్సిన చర్యల గురించి తెలిపారు . జిల్లాలో ఉన్న నీటి వనరుల ట్యాంకుల సరిహద్దులో ఎలాంటి ఆక్రమణలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. గ్రామాలలో సామూహిక ఇంకుడు గుంతలు నిర్మాణం, వ్యక్తిగత ఇంకుడు గుంతల నిర్మాణం, అటవీ పునరుద్ధరణ వంటివి చేపట్టాలని తెలిపారు.

జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి జలశక్తి అభియాన్ క్యాచ్ థ రైన్ క్యాంపెయిన్ చేపట్టామని అన్నారు. గత 6 సంవత్సరాల కాలంలో జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతుందని, జిల్లాలో కురుస్తున్న వర్షపు నీరు వృధా కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వర్షపు నీరు వృధా కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలలో అవగాహన పెంచుతున్నామని, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ విక్రమాల అమలు చేస్తున్నామని తెలిపారు. వీటిలో భాగంగా చెరువుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ చర్యలు, వాటర్ షెడ్ల అభివృద్ధి, అడవుల పెంపకం, నీటి మేనేజ్మెంట్ చర్యలు విస్తృతంగా చేపట్టామని అన్నారు. మహిళా సంఘాలు, , గ్రామసభల ద్వారా గ్రామాలలో నీటి సంరక్షణ పనులను గుర్తించామని పేర్కొన్నారు. అనంతరం గ్రామీణభవృధి సంస్థ అద్వర్యం లో ఏర్పాటు చేసిన జలశక్తి అభియాన్ కేంద్రానికి కేంద్ర సభ్యులు పరిశీలించారు. కేంద్రం లో వున్నా రిజిస్టర్లు తనిఖీ చేసారు.జిల్లా లో వున్న నీటివనరులు, నీటి సరఫరా వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కిన్నరసాని ప్రాజెక్ట్ ను పరిశీ లించారు. ఈ సందర్బంగా ఆయన పాజెక్ట్ విస్తీర్ణం, నీటి నిల్వ, పాజెక్ట్ ద్వారా నీటి సరఫరా ఏ ప్రాంతాలకు జరుగుతుంది తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్ట్ మోటర్ హౌస్ ని పరిశీలించారు.

అనంతరం ములకలపల్లి మండలం లోని అంకిత మండల మహిళా సమాఖ్య కార్యాలము లో ఏర్పాటు చేసిన మహిళా స్వయం సహాయక సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కేంద్ర సభ్యులు స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన ఆహార పదార్దాలు మరియు వస్తువులను పరిశీలించారు. అనంతరం సమావేశం నిర్వహించారు.ఈ సమావేశం లో ముందుగా మహిళా సంఘ సభ్యులతో ఈ సందర్బంగా కేంద్ర సభ్యులు మాట్లాడుతూ నీటి పొదుపు అనేది మహిళల ద్వారానే సాధ్యం అవుతుందని తెలిపారు. నీటి పొదుపు చెయ్యడనికి ఎం జాగర్తలు మరియు చర్యలు తీసుకుంటారు అని అడిగి తెలుసుకున్నారు.ప్రతి ఇంటిలో వర్షపు నీటికి ఇంకుడుగుంతలు ఏర్పాటు చెయ్యాలి.ఇంత మంది మీహిళలతో సమావేశం లో పాల్గొనటం నా కుటుంబసభ్యుయులతో మాట్లాడుతున్నట్టు వున్నది అని తెలిపారు.అనంతరం కార్యాలయం లో మొక్కలు నాటారు. మండల పరిషత్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, ఉద్యానవన శాఖ అధికారి సురనారాయణ, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి అర్జున్ రావు, మిషన్ భగీరథ ఈఈ తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :