తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : స్టేషన్ బేతపూడి గ్రామం సమీపంలో ఈరోజు ఉదయం 09:30 జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జూలూరుపాడు మండలం రాచమల్ల కోయగూడెం గ్రామానికి చెందిన పూనెం సమ్మయ్య ( తండ్రి: పోతురాజు, వయసు: 50 సంవత్సరాలు ) సుతారీ (మేస్త్రీ) పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈరోజు ఉదయం సుమారు 08:00 గంటల సమయంలో ముత్యాలంపాడు గ్రామంలో ఉన్న తన బంధువు వజ్జ భవాని ఇంటి వద్ద గల సుతారీ పని నిమిత్తం, తన అన్న పూనెం భాస్కర్ గారికి చెందిన గ్లామర్ బైక్ (రిజిస్ట్రేషన్ నెంబర్: TS 04 EJ 5018) పై బయలుదేరారు.ఆయన కొత్త అంజనాపురం గ్రామం మీదుగా వెళ్తుండగా, ఉదయం సుమారు 09:30 గంటల సమయంలో మేడేపల్లి గ్రామం దాటిన తర్వత బైక్ అతివేగంగా ఉండటం వల్ల అదుపుతప్పి, రోడ్డు పక్కనే ఉన్న కరెంటు పోల్‌ను చాలా బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు సమ్మయ్య బైక్ పైనుంచి ఎగిరి కరెంటు పోల్‌కు తల బలంగా తగలడంతో, కుడివైపు తలభాగంలో తీవ్రమైన రక్తగాయమై ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.మృతుడి కొడుకు విష్ణు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము.
Admin
తెలుగు వెలుగు టీవీ