తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటళ్లలో అత్యవసర వైద్య సేవలు పొందిన పేద మధ్యతరగతి ప్రజానీకాన్ని ఆదుకునేందుకు.. ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి సిఫారసుతో ముఖ్యమంత్రి సహాయ నిధి( సీఎంఆర్ఎఫ్)నుంచి చెక్కులు మంజూరయ్యాయి. ఈ మేరకు శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన 25 మంది లబ్ధిదారులకు రూ.7,65,000 విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను విద్యానగర్ కాలనీలోని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో..కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దేవీ ప్రసన్న, తదితరులుతో కలిసి ఎంపీ రఘురాం రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. అర్హులైన పేదలందరికీ లబ్ధి చేకూరేలా, ఆరోగ్య భరోసా లభించేలా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయనిధి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో.. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్య రాంబాబు, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ