తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వృత్తి నైపుణ్య శిక్షణ తో ఉపాధి అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. శుక్రవారం పాల్వంచలోని నవ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పూర్తి చేసుకున్న ఐటిఐ విద్యార్థుల కు ధ్రువీకరణ పత్రాలు అందజేయు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పార్టీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ శిక్షణ కేంద్రంలోని అన్ని తరగతి గదులను పరిశీలించి శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ శిక్షణ ఎలా ఉంది, ఏ కోర్సు శిక్షణ తీసుకుంటున్నారు అన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో సిపిఓ సంజీవరావు, నవ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపాల్, శిక్షణ కేంద్ర ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ