Wednesday, 16 September 2026 03:29:21 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

కొత్తగూడెం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 కోట్ల 63 లక్షల రూపాయల విలువ గల గంజాయి పట్టివేత

Date : 12 April 2025 08:56 PM Views : 1673

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ రోజు అనగా 12.04.2025 ఉదయం 9:30 గంటలకు విశ్వసనీయ సమాచారం మేరకు కొత్తగూడెం వన్టౌన్ పోలీసులు మరియు సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా కొత్తగూడెం వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శేషగిరినగర్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీలలో UP82AT9894 అను నంబరు గల లారీని ఆపి తనిఖీ చేయగా అందులో 727.360 కిలోల ప్రభుత్వ నిషేదిత గంజాయిని గుర్తించడం జరిగింది. సుమారుగా 3,63,68,000/- రూపాయల విలువ గల ఇట్టి గంజాయిని పోలీసులు స్వాదీనం చేసుకోవడమైనది. లారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. శివమ్ గుప్తా, 40 yrs, 0యల్ ఎస్టేట్ వ్యాపారి, R/o.జగదీష్ఫుర, బోదలా PS, ఆగ్రా జిల్లా, ఉత్తరప్రదేశ్ అను వ్యక్తి ఈ రోజు పట్టుబడిన లారీ డ్రైవర్ భూరి సింగ్ S/O. డాక్ సింగ్, 38yrs, నాగుల బుద్ధ గ్రామం, ఆగ్రా జిల్లా, ఉత్తరప్రదేశ్ మరియు రవి కుమార్, S/O.కమల్ సింగ్, 33yrs, భోగిపురం గ్రామం, ఆగ్రా జిల్లా, ఉత్తరప్రదేశ్ అను ఇద్దరు వ్యక్తులకు 08.04.2025 నాడు నగదును ఇచ్చి ASR జిల్లా, చింతూరు మండలంలోని తులసిపాక గ్రామ అటవీ ప్రాంతంలో నిషేదిత గంజాయిని లోడ్ చేసుకొని రావాల్సిందిగా చెప్పి పంపినాడు.10.04.2025 తేదీన వీరిరువురు తులసిపాక చేరుకుని అక్కడ ఏడుగురి వద్ద నుండి 727.360 కేజీల గంజాయిని లారీ క్యాబిన్ కు మరియు ట్రక్ నకు మధ్య భాగంలో ఎవరికీ కనపడకుండా ఒక చాంబర్ లాగా తయారు చేసి అందులో అమర్చుకుని తిరిగి భద్రాచలం, ఖమ్మం, హైదరాబాద్ మీదుగా ఆగ్రాకు నిషేధిత గంజాయిని తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో ఈ రోజు కొత్తగూడెం వన్దాన్ మరియు సిసిఎస్ పోలీసులు వీరిని పట్టుకోవడం జరిగింది. ఇట్టి నిషేధిత గంజాయిని అమ్మిన వ్యక్తులపైన, కొనుగోలు చేసిన వ్యక్తులు మరియు రవాణా చేస్తున్న వ్యక్తులందరిపై కేసు నమోదు చేసి అట్టి రవాణాకు ఉపయోగించిన లారీను మరియు మొబైల్ ఫోన్లను కూడా సీజ్ చేయడం జరిగినది. పట్టుబడిన ఇద్దరు వ్యక్తుల వివరాలు A1). భూరి సింగ్ S/o.డాక్ సింగ్, 38yrs, నాగుల బుద్ధ గ్రామం, మల్ పురా PS, ఆగ్రా జిల్లా, ఉత్తరప్రదేశ్ A2).రవి కుమార్, S/O. కమల్ సింగ్, 33yrs, భోగిపురం గ్రామం, షాగంగా PS, ఆగ్రా జిల్లా, ఉత్తరప్రదేశ్. కొనుగోలు చేసిన వ్యక్తి A3). శివమ్ గుప్తా, R/o. జగదీష్ఫుర, ఆగ్రా జిల్లా, ఉత్తరప్రదేశ్, అమ్మిన వ్యక్తుల వివరాలు: A4). కొర్రా సీతా రాములు , A5) వంతాల విశ్వనాద్, A6). వంతాల బాబూరావు A7). కిలో చిన్నారావు , A8), కిలో సాయి బాబు,A9).కిలో శంకర్ రావు, A-10).భద్రి ఈ రోజు పట్టుబడిన ఇద్దరూ వ్యక్తులను జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టు నకు తరలించడం జరిగినది. నిషేధిత గంజాయి అక్రమ రవాణాను సమర్థవంతంగా అడ్డుకుని నిందితులను చాకచక్యంగా పట్టుకున్న కొత్తగూడెం 1 టౌన్ సిఐ కరుణాకర్, ఎస్సై విజయ, సిసిఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్, ఎస్సైలు ప్రవీణ్, రామారావు మరియు సిబ్బందిని ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ప్రత్యేకంగా అభినందించారు. సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్ భద్రాద్రి కొత్తగూడె జిల్లా

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :