తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈరోజు సుజాతనగర్ చింతలపూడి సత్యం భవన్ లో గొర్రెల మేకల పెంపకదారుల సంఘం జిల్లా మహాసభ ఆహ్వాన సంఘం ఏర్పాటుకై సన్నాహక సమావేశం కొండబోయిన వెంకటేశ్వర్లు అధ్యక్షతన సంఘం జిల్లా కార్యదర్శి కాట్రాల తిరుపతిరావు మాట్లాడుతూ గొర్రెల మేకల పెంపకం దారులు సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాల నివసించిందని. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 420 హామీల్లో భాగంగా గొర్రెల పథకానికి నగదు బదిలీ కింద డబ్బులు ఇస్తామని చెప్పి ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో కావస్తా ఉన్న ఇంతవరకు గొర్రెల కాపరుల సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తా ఉంది తక్షణమే ప్రభుత్వం గొర్రె కాపరులకు నగదు బదిలీ చేస్తానని చెప్పిందో ప్రతి ఒక్కరికి అకౌంట్లో నగదు బదిలీ చేయాలని. గొర్రెలకు మేకలకు ఈ వర్షాకాలం సీజన్లో అనేక రోగాలు రాకుండా ప్రభుత్వం పశువుల ఆసుపత్రులకు సరిపడా మందులు ఇవ్వాలని పశువుల ఆస్పటల్ లో ఉన్న డాక్టర్ల, అటెండర్లు పోస్టులను భర్తీ చేయాలని. ఆగస్టు 13న సుజాతనగర్ మండలంలో జరిగే గొర్రెల మేకల పెంపకదారుల సంఘం జిల్లా మహాసభలను అధిక సంఖ్యలో గొర్రె కాపుల పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు మల్లెబోయిన లింగయ్య,జంగిలి వెంకటరత్నం,సహాయ కార్యదర్శి బచ్చలకూర శ్రీను,గాలి రామారావు,బచ్చలకూర వీరస్వామి, పదిమల మల్లికార్జున్, బడుగుల శివ,మారుతి గోపాలరావు,ఎనుముల ప్రభాకర్,ఎనుముల మల్లేష్,మారుతి నాగేశ్వరరావు,నూకల సురేష్, చెన్నబోయిన నాగేశ్వరావు, జోనబోయిన అంజన్ రావు,పగడాల వెంకన్న,ఉగ్గం సైదుబాబు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ