తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సీతారాములు ను సన్మానించిన కొత్తగూడెం సోసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు . కొత్తగూడెం ( ) టీపీసీసీ జనరల్ సెక్రటరీగా నియమితులైన నాగా సీతారాములు ను సోసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు శాలువాతో సన్మానించి సత్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు గత 3 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు చేస్తున్న కృషిని గుర్తించిన కాంగ్రెస్ అగ్ర నాయకత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు ఈ సారి ఆయనకు టీపీసీసీ జనరల్ సెక్రటరీగా అవకాశం ఇవ్వడం అభినందనీయమన్నారు. నియోజకవర్గంలోనే కాక జిల్లా వ్యాప్తంగా ఆయన చేస్తున్న కార్యక్రమాలను గుర్తించి ఆయనకు నామినేట్ పదవి ఇవ్వాలన్నారు. యాదవ వర్గానికి చెందిన సీతారాములుకు ఇవ్వడం వల్ల బీసీలకు సమన్యాయం చేసినట్టు అయిందన్నారు. మత్స్య శాఖ అధ్యక్షులు బానోత్ సూర్యం, భక్తుల రమేష్, కార్యదర్శి పిట్టల సాయిలు, మాజీ అధ్యక్షులు లింగం లక్ష్మయ్య, డైరెక్టర్ బానోతు మున్న కోఆప్షన్ సభ్యులు ఎట్టి భాస్కర్ రావు, గౌరవ సభ్యులు అజ్మీర, అమ్రు భూక్య లక్ష్మణ్, కాంగ్రెస్ నాయకులు బత్తుల రమేష్,దండు కృష్ణయ్య, వడుగు నరసింహారావు, మల్లిపెద్ది నాగరాజు, చల్ల వెంకటేష్, కోమారి రవీందర్, చేతుల మహేష్, గుగులోతు కోటేష్, భూక్య సంతోష్ తదితరులు నాగా సీతారాములు ను సన్మానించారు
Admin
తెలుగు వెలుగు టీవీ