తెలుగు వెలుగు టీవీ - వార్తలు / బూర్గంపాడు : బూర్గంపాడు పాముల సాహెబ్ వీధిలో దారుణం చోటుచేసుకుంది. భార్య సోనిని భర్త శంషీర్ పాష గొంతు నులిమి హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం శంషీర్ పాష బూర్గంపాడు పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ మేడ ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. భార్య భర్తల మధ్య గొడవల కారణంగా ఈ హత్య జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Admin
తెలుగు వెలుగు టీవీ