తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : హమారా ప్రసాద్ ను తూతూ మంత్రంగా అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదని,అతనిపై ఊపా చట్టం కింద కేసు నమోదు చేయాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం మండలంలోని ఫంక్షన్ హాల్ నందు జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి అంబేద్కర్ గారిని ప్రపంచమంతా మేధావిగా గుర్తించి ఆయన జయంతిని వరల్డ్ నాలెడ్జి డే గా ప్రకటిస్తే అటువంటి మహనీయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ,అంబేద్కర్ పై కల్పిత నాయకుడు పుస్తకాన్ని 18వ తేదీన ఆవిష్కరణ చేస్తానని ప్రకటించిన హమారా ప్రసాద పై గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో అంబేద్కర్ వాదులు రాజకీయ పార్టీల నాయకులు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినా ప్రభుత్వం ముందే అరెస్టు చేయకపోవడం వల్ల సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కల్పిత నాయకుడు పుస్తక ఆవిష్కరణకు పూనుకున్నాడని,ప్రభుత్వ అండదండలు లేకుండానే ఇంత సాహసానికి పూనుకున్నాడా అని ప్రశ్నించారు ఇన్ని రోజులు అరెస్ట్ చేయకుండా ఇప్పుడు ప్రభుత్వం అరెస్ట్ చేయడం కాదని అతనిపై ఊపా చట్టం కింద కేసు నమోదు చేసి బెయిల్ రాకుండా చేయాలని అంబేద్కర్ పై హమారా ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుందని ప్రశ్నించారు.ఆర్ఎస్ఎస్,బీజేపీ మతోన్మాదులు హమారా ప్రసాద్ తో అంబేద్కర్ కు వ్యతిరేకంగా మాట్లాడిస్తుంది వాస్తవం కదా అని నిలదీశారు.నిజంగా బీజేపీ వారికి సంబంధం లేకపోతే హమారా ప్రసాద్ అంశంపై మౌనంగా ఎందుకు ఉంటున్నారు బహుజన సమాజానికి సమాధానం చెప్పాలన్నారు.అంబేద్కర్ జీవించి ఉంటే గాడ్సే గాంధీని కాల్చిన విధంగా తాను అంబేద్కర్ ను చంపేవాడిని అని వ్యాఖ్యలు చేసినా ప్రభుత్వం ఎందుకు ఊపా చట్టం కింద కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు.జైభీమ్ రావ్ భారత్ పార్టీ ప్రజా సంఘాల నుండి వస్తున్న వ్యతిరేకతతో ప్రభుత్వం అరెస్ట్ చేసినట్టు సమాచారం ఉందని అరెస్ట్ చేసిన హమారా ప్రసాద్ కు బెయిల్ రాకుండా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జునరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ వీరు నాయక్ , అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్, కిరణ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ