తెలుగు వెలుగు టీవీ - వార్తలు / భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ