Wednesday, 16 September 2026 03:33:28 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

భూ భార‌తి రైతుల‌కు శ్రీ‌రామ‌ర‌క్ష, మంత్రి పొంగులేటి

Date : 28 April 2025 02:01 PM Views : 810

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 28 తెలుగు వెలుగు)భూ భారతి చట్టంలో ప్రతీ భూ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని... ధరణిలా ఇది నాలుగు గోడల మధ్య తెచ్చిన స్వార్ధ పూరిత చట్టం కాదని.... రైతులకు భూ భారతి చట్టం శ్రీరామ రక్ష అని అన్నారు. భూ భారతి - 2025 చట్టంపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సుల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం శ్రీ శ్రీ కళ్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఈ చ‌ట్టం చేసేముందు రైతుల క‌ష్టం గురించి ఆలోచించి ప్ర‌త్యేక క‌మిటీ ఏర్పాటు చేశామ‌న్నారు. ఆ క‌మిటీ సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకొని రైతులకు శ్రీ‌రామ‌ర‌క్ష‌లా నిలిచే విధంగా భూభార‌తి -2025 చ‌ట్టాన్ని రూపొందించామ‌ని తెలిపారు. గ‌తంలో నాలుగు గోడ‌ల మధ్య స్వార్ధ‌పూరితంగా త‌యారుచేసిన ధ‌ర‌ణి చ‌ట్టానికి మూడేళ్లు గ‌డిచినా నియ‌మ‌నిబంధ‌న‌లు రూపొందించ‌లేదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు మండ‌లాల్లో తొలివిడ‌త ప్ర‌యోగాత్మ‌కంగా అమ‌లు చేసి అన్ని వివ‌రాలు, ద‌ర‌ఖాస్తులు సేకరిస్తున్నామని, జూన్ 2 నాటికి వీలైన‌న్ని స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించి , అర్హులైన వారికి అందుబాటులో ఉన్న ప్ర‌భుత్వ భూముల‌ను ప‌ట్టాలుగా అంద‌జేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసినట్లు వివరించారు. భూ య‌జ‌మానుల‌కు న్యాయం జ‌రిగేలా త‌హ‌శీల్దార్ మొద‌లు కొని సీసీఎల్ఎ వ‌ర‌కు ఐదంచెల వ్య‌వ‌స్ద‌ను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. సీసీఎల్ఎ వ‌ద్ద కూడా న్యాయం జ‌ర‌గ‌లేద‌ని భావిస్తే ట్రిబ్యునల్ ను ఆశ్రయించవచ్చన్నారు. ఈ మేర‌కు రాష్ట్రవ్యాప్తంగా అవ‌స‌ర‌మైన‌న్ని ట్రిబ్యున‌ల్స్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో వచ్చేనెల 10వ తేదీక‌ల్లా రెవెన్యూ ,గ్రామ‌ ప‌రిపాల‌నాధికారులు ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉండేలా చ‌ర్య‌లు చేప‌డుతున్నామని తెలిపారు. త‌ప్పుచేసే అధికారుల‌పై చ‌ర్య‌లకు వెనుకాడ‌బోమని స్పష్టం చేశారు. గ‌తంలో రైతు బంధు కోసం గులాబీ రంగు కార్య‌కర్త‌ల‌కు భూమి లేక‌పోయినా ప‌ట్టాదారు పాసుపుస్త‌కాలు ఇచ్చారని, స‌క్ర‌మంకాని అటువంటి అక్ర‌మాల‌పై చ‌ర్య‌లు త‌ప్ప‌వని హెచ్చరించారు. రైతుల‌కు మ‌రిన్ని సేవ‌లు అందేలా రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తుందని ఏ పార్టీ కార్య‌క‌ర్త అనే ప‌క్ష‌పాతం లేకుండా ఇందిర‌మ్మ రాజ్యంలో పేద‌ల‌కు చ‌ట్టం ఒక చుట్టంలా ఉప‌యోగ‌ప‌డేలా చూస్తామని మంత్రి పొంగులేటి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :