తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఎన్నిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జయగణేష్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడింది. ప్రజాస్వామ్య పద్దతిలో పారదర్శకంగా నిర్వహించిన ఈ ఎన్నికలో నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు పులిపాటి పాపారావు మాట్లాడుతూ, జర్నలిజం ఒక పవిత్రమైన బాధ్యత అని, ముఖ్యంగా నేటి కాలంలో యూట్యూబ్ ఆధారిత జర్నలిజం వేగవంతమైన సమాచారం అందించడంలో కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. మీడియా యొక్క అసలు బలం ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలను వెలుగులోకి తేవడంలోనే ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా గౌరవ అధ్యక్షులు టి. రామ్ నరసింహఅధ్యక్షులు అనిశెట్టి సతీష్ కుమార్ ఉపాధ్యక్షులు మాలోత్ వేణు, ప్రధాన కార్యదర్శి కోడి రెక్కల కమలాకర్, కార్యదర్శి బీరా రవీందర్ నాథ్ , సహాయ కార్యదర్శి దాస్యం మహేష్, సంయుక్త కార్యదర్శి దామోదర్ గౌడ్ ట్రెజరర్ శనగ లక్ష్మణ్ గౌరవ సలహాదారులు బృహస్పతి శ్రీరామ్,ఋషి కుమార్ కార్యవర్గ సభ్యులు:మోట జగదీష్, భూపతి అశోక్,సురేష్ ,ప్రసాద్ లను రాష్ట్ర కమిటీ అభినందించింది. భవిష్యత్తులో జిల్లాలో యూట్యూబ్ న్యూస్ జర్నలిస్టుల సంక్షేమం కోసం, వారికి కావలసిన రక్షణ కోసం, అలాగే వృత్తి నైపుణ్యాల పెంపుకోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని పులిపాటి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ వైస్ ప్రెసిడెంట్ యం.డి ఫైసుద్దీన్, జనరల్ సెక్రటరీ పులకంటి శ్రీనివాస్, ట్రెజరర్ రామ్ టెంకి శ్రీనివాస్, సెక్రటరీ రామడుగు కొనరన్న, పల్లె నరసింహ రెడ్డి ,సహాయ కార్యదర్శి కర్రే. నరేందర్ గౌరవ సలహాదారు యం డి గౌస్ పాషా, ఎక్జిక్యూటివ్ కమిటీ మెంబర్ డి.ప్రేమ్ కుమార్, భరత్ జిల్లా స్థాయి సభ్యులు, నూతన కమిటీ సభ్యులు, పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ