Thursday, 17 September 2026 05:09:28 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

మెగాస్టార్ చిరంజీవికి భారతరత్న అవార్డు ఇవ్వాలి

Date : 26 August 2026 01:11 PM Views : 163

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కేంద్ర ప్రభుత్వానికి ప్రముఖ సామాజికవేత్త కోసున శ్రీనివాస్ (పోస్ట్ ఆఫీస్ వాసు) విజ్ఞప్తి ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ డాక్టర్ కె. చిరంజీవికి దేశ అత్యున్నత పౌర పురస్కారం “భారతరత్న” అవార్డును ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రముఖ సామాజికవేత్త కోసున శ్రీనివాస్ (పోస్ట్ ఆఫీస్ వాసు) విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఐదు దశాబ్దాలుగా నటుడిగా, నృత్య కళాకారుడిగా తెలుగు సినీ పరిశ్రమకు చిరంజీవి అందించిన సేవలు అపూర్వమైనవని అన్నారు. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న చిరంజీవి తెలుగు సినిమా ఖ్యాతిని దేశ, విదేశీ వేదికలపై మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు. సినీ రంగంతో పాటు సామాజిక సేవలోనూ చిరంజీవి తనదైన ముద్ర వేశారని కోసున శ్రీనివాస్ పేర్కొన్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి సేవా కార్యక్రమాల ద్వారా ఎంతోమంది ప్రజలకు ఆయన అండగా నిలిచారని తెలిపారు. ముఖ్యంగా కరోనా సంక్షోభ సమయంలో సినీ కార్మికులు, పేదలు, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడంలో చిరంజీవి చూపిన మానవత్వం అభినందనీయమన్నారు. కళా రంగానికి ఆయన చేసిన విశేష సేవలను గుర్తించి ఇప్పటికే పద్మవిభూషణ్ వంటి అత్యున్నత గౌరవాలు లభించాయని, అయితే కళా సేవతో పాటు సామాజిక సేవా రంగాల్లో చిరంజీవి అందించిన అపూర్వమైన సేవలకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన “భారతరత్న” సముచితమైన గౌరవమని కోసున శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ప్రముఖ నటులు, సీనియర్ రాజకీయ నాయకులు సైతం చిరంజీవికి భారతరత్న ఇవ్వాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, ఆ డిమాండ్‌కు తాము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని అన్నారు. తెలుగు ప్రజల తరఫున, కళాభిమానుల తరఫున కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవిని “భారతరత్న” పురస్కారంతో గౌరవించాలని కోసున శ్రీనివాస్ కోరారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :