Sunday, 02 August 2026 07:32:13 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

Date : 28 July 2026 07:30 PM Views : 94

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.సాంకేతిక సమస్యల అధిగమించి నిర్మాణాలు పూర్తి చేయాలి.పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలి. రెండో విడత నిర్మాణాలకు పక్కా ప్రణాళిక రూపొందించండి.సమీక్షా సమావేశంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.మొదటి విడత కింద ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయాలని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం కొత్తగూడెంలోని క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ, మున్సిపల్ కార్పొరేషన్, మండల ప్రజాపరిషత్ అధికారులతో ఇండ్ల నిర్మాణ పురోగతిపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో నిర్మాణాల్లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించి, పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఇండ్ల నిర్మాణాలను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్క పేదవానికి సొంతింటి కల నెరవేరేలా యంత్రాంగం పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. అదేవిధంగా రాబోయే రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు సంబంధించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తుగానే పక్కా ప్రణాళికలతో సంసిద్ధంగా ఉండాలని అధికారులను కోరారు. ప్రజాధనం వృథా కాకుండా, నాణ్యతా ప్రమాణాలకు పెద్దపీట వేస్తూ పేదలకు నాణ్యమైన ఇళ్లను అందించడంలో అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. నియోజకవర్గంలో జరుగుతున్న ఇతర అభివృద్ధి పనులపై ద్రుష్టి సారించి నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. సమీక్షా సమావేశంలో కార్పొరేషన్ కమిషనర్ సుజాత, చుంచుపల్లి ఎంపిడివో సుభాషిణి, లక్ష్మీదేవిపల్లి ఎంపిడివో సుస్మిత, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :