తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏప్రిల్ 29 (తెలుగు వెలుగు) : జూలూరుపాడు మండలం వినోబా నగర్ గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం. జరిగింది రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులో ముగ్గురు సౌత్ కొరియాకు చెందిన టూరిస్టులు. భద్రాచలం వెళుతుండగా ఆళ్లపల్లి మండలానికి చెందిన ఫ్యామిలీ హైదరాబాదు వెళుతున్న సమయంలో జూలూరుపాడు వినోబా నగర్ గ్రామ సమీపంలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని 108 వాహనంలో కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఒక వ్యక్తి మరణించాడు. మిగతా ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి . ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Admin
తెలుగు వెలుగు టీవీ