తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా షూటింగ్ క్రీడకు మరో ఘనత లభించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గరిడేపల్లి భావన బాలికల విభాగంలో, కొమరోజు శ్రీరామ్ బాలుర విభాగంలో అద్భుత ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి షూటింగ్ పోటీలకు ఎంపికయ్యారు.ఇటీవల కేరళలోని త్రివేండ్రంలో 31-08-2026 నుండి 09-09-2026 వరకు నిర్వహించిన సౌత్ జోన్ రైఫిల్ అండ్ పిస్టల్ షూటింగ్ ఛాంపియన్ షిప్-2026 అర్హత పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రీడాకారుల పట్ల జిల్లా షూటింగ్ క్రీడా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. క్రమశిక్షణతో కూడిన శిక్షణ, నిరంతర సాధనతో పాటు కోచ్ శ్రీ ఎం.డి. అబ్దుల్ నబి మార్గదర్శకత్వంలో ఈ ఇద్దరు క్రీడాకారులు ఈ ఘనతను సాధించారు.జాతీయస్థాయి పోటీలు ఈ ఏడాది డిసెంబర్ నెలలో డెహ్రాడూన్ షూటింగ్ రేంజ్ లో నిర్వహించనున్నట్లు తెలిపారు. జాతీయస్థాయిలో కూడా భావన, శ్రీరామ్ తమ ప్రతిభను చాటుకుని జిల్లాకు మరింత పేరు ప్రతిష్టలు తీసుకురావాలని జిల్లా క్రీడాభిమానులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైఫిల్ షూటింగ్ అసోసియేషన్ ప్రతినిధులు, కోచ్లు, తల్లిదండ్రులు మరియు తోటి క్రీడాకారులు భావన, శ్రీరామ్లలను అభినందించారు. జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి ఎం. పరంధామ రెడ్డి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు భావన, శ్రీరామ్ తో పాటు కోచ్ MD. అబ్దుల్ నబిని ప్రత్యేకంగా అభినందించారు. క్రీడాకారులు జాతీయస్థాయిలో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. భావన, శ్రీరామ్ జాతీయస్థాయి ఎంపిక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో షూటింగ్ క్రీడ అభివృద్ధికి మరో మైలురాయిగా నిలిచింది. Meedy జిల్లా యువజన మరియు క్రీడల అధికారి భద్రాద్రి కొత్తగూడెం.
Admin
తెలుగు వెలుగు టీవీ