తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జల్, జంగల్, జమీన్ హక్కులను కాపాడుకుందాం. పోడు భూములకు పట్టాలిచ్చి ఆదుకోవాలి.అటవీ చట్టాల సవరణ కుట్రలను తిప్పికొడతాం.కొమరం భీమ్ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఎస్ కే సాబీర్ పాషా.అడవి, భూమి, ఆత్మగౌరవం కోసం గిరిజనులు సాగించిన వీరోచిత పోరాటాలను కొనసాగిస్తూ, హక్కుల పరిరక్షణకు ఏకమవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఎస్ కే సాబీర్ పాషా పిలుపునిచ్చారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్రాస్ రోడ్ లో ఉన్న విప్లవ వీరుడు కొమరం భీమ్ విగ్రహానికి సిపిఐ నాయకులతో కలసి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తరతరాలుగా అడవినే నమ్ముకుని జీవిస్తున్న గిరిజనుల హక్కులను కాలరాచేలా పాలకుల తీరు ఉందన్నారు. సాగు చేసుకుంటున్న పోడు భూములకు వెంటనే పట్టాలు మంజూరు చేసి గిరిజన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అటవీ హక్కుల చట్టాన్ని సవరించి కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు జరుగుతున్న కుట్రలను ప్రజలంతా కలిసికట్టుగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. జల్, జంగల్, జమీన్ కోసం ప్రాణాలర్పించిన కొమరం భీమ్ వీరోచిత పోరాట స్ఫూర్తితో గిరిజనుల ఆత్మగౌరవ రక్షణకు, హక్కుల సాధనకు భవిష్యత్తులో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ