Monday, 03 August 2026 02:03:20 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి.

Date : 01 August 2026 06:48 PM Views : 176

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : "జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి!""సింగరేణి మనుగడ, కార్మికుల ఉపాధి, తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణే ప్రభుత్వ బాధ్యత – ఏఐటీయూసీ గుర్తింపు సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్." మణుగూరు పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికి కేటాయించాలని కోరుతూ ఏఐటీయూసీ గుర్తింపు సంఘ ఆధ్వర్యంలో హైదరాబాదులోని ప్రెస్క్లబ్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది, సందర్భంగా సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ కూనంనేని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలు సింగరేణి కార్మికుల ఆకాంక్షలను ప్రతిబింబిస్తున్నాయని ఏఐటీయూసీ గుర్తింపు సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ పేర్కొన్నారు. సింగరేణి సంస్థ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.మణుగూరు పీకే–2 డీప్ సైడ్ బ్లాక్ సింగరేణి మనుగడకు అత్యంత కీలకమైన బొగ్గు నిల్వల ప్రాంతమని, వేలాది మంది కార్మికుల ఉపాధి, భద్రత, భవిష్యత్తు ఈ బ్లాక్‌పైనే ఆధారపడి ఉందని తెలిపారు. ఈ బ్లాక్‌ను సింగరేణికి ఇవ్వకుండా ఇతర సంస్థలకు అవకాశాలు కల్పించడం తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు, కార్మికుల సంక్షేమానికి తీవ్ర విరుద్ధమని స్పష్టం చేశారు.ముఖ్యంగా జెన్‌కోను వేలంపాట (Auction) ప్రక్రియలో పాల్గొనకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి అని వారు ఘాటుగా డిమాండ్ చేశారు. జెన్‌కో పేరుతో వేలంపాటలో ప్రవేశపెట్టి చివరకు ప్రైవేట్ కంపెనీలకు మార్గం సుగమం చేసే కుట్రలను ఏఐటీయూసీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని హెచ్చరించారు. పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను నేరుగా సింగరేణికే కేటాయించేలా ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. ఒకవైపు సింగరేణిని బలోపేతం చేస్తామని చెబుతూ, మరోవైపు కీలక బొగ్గు బ్లాక్‌ల విషయంలో అనిశ్చితి సృష్టించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. సింగరేణి సంస్థకు తగినంత బొగ్గు నిల్వలు లేకుంటే భవిష్యత్తులో ఉత్పత్తి తగ్గిపోవడం, వేలాది మంది కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడడం, తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే శ్రీ కూనంనేని సాంబశివరావు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన అంశాలను అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి, పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికి కేటాయించేలా ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. కార్మికుల, ప్రజల, తెలంగాణ ప్రయోజనాలను కాపాడే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని పేర్కొన్నారు.సింగరేణి సంస్థను బలహీనపరిచే ఎలాంటి చర్యలనైనా ఏఐటీయూసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, అవసరమైతే కార్మికులతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సింగరేణి హక్కులను కాపాడేందుకు అన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటాన్ని విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకుని, మణుగూరు పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఏఐటీయూసీ గుర్తింపు సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. "సేవ్ సింగరేణి – సేవ్ మణుగూరు" నినాదంతో కార్మికుల హక్కులు, సింగరేణి భవిష్యత్తు కోసం పోరాటం మరింత ఉధృతంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆళవందార్ వేణు మాధవ్, ఏఐటీయూసీ నాయకులు కె.వేంకటష్ రాష్ట్ర ఆటో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి. ఎస్.నర్సింగ్ రావ్, కె.బీరయ్య, ఏ.ప్రభాకర్, ఎం.రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :