తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సీతారాం ప్రాజెక్టు కాలువలో పడి ఇద్దరు మృతి చెందిన ఘటన ఆదివారం బూర్గంపాడు మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. జింకలగూడెం సీతారాం ప్రాజెక్టు కాలువలో ఇద్దరు గల్లంతయ్యా రని సమాచారం అందుకున్న ఎస్సై రాజేశ్ గజ ఈతగాళ్లతో గాలించి మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరు ప్రమాదవశాత్తు పడిపోయారా? లేక ఆత్మహత్య చేసుకున్నారా? అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
Admin
తెలుగు వెలుగు టీవీ