Tuesday, 03 November 2026 03:58:00 AM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

మైన్ యాక్సిడెంట్లో చనిపోయిన ఉద్యోగుల డిపెండెంట్లకు గ్రేడ్ 3 క్లర్కులు

Date : 25 September 2025 05:48 PM Views : 367

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణిలో మైన్ యాక్సిడెంట్లో చనిపోయిన ఉద్యోగుల డిపెండెంట్ లకు 2009 అగ్రిమెంట్ ప్రకారం ఆనాడు గుర్తింపు సంఘం గా ఉన్న ఏఐటియుసి ఒప్పందం మేరకు సంస్థలో ఉన్న టెక్నికల్ అర్హత కలిగిన డిపెండెంట్ లకు మాత్రమే సూటబుల్ ఎంప్లాయిమెంట్ అనగా సూపర్వైజర్స్ గా టెక్నీషియన్స్ గా అవకాశం కల్పించబడింది. కానీ నాన్ టెక్నికల్ డిగ్రీ కలిగి ఏదేని ఉద్యోగి ప్రమాదంలో చనిపోతే వారి డిపెండెంట్ లకి అండర్ గ్రౌండ్ జనరల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ప్రమాదాలు జరిగి చాలామంది ఉద్యోగులు చనిపోయారు. వారి పిల్లలకు సూటబుల్ ఉద్యోగాన్ని యాజమాన్యం కల్పించలేదు. అందువల్ల గుర్తింపు సంఘం గా ఎన్నికైన తర్వాత ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని స్ట్రక్చరల్ కమిటీలో ఈ డిమాండ్ ని చేర్చి యాజమాన్యంతో అగ్రిమెంట్ చేయించడం జరిగింది. ఇది చట్టబద్ధంగా ఉండాలని పారిశ్రామిక వివాదాల చట్టం 12 (3) ప్రకారం ట్రైపార్టెంట్ అగ్రిమెంటు తేదీ.25.09.25 న హైదరాబాదులో డిప్యూటీ సిఎల్సి సమక్షంలో యాజమాన్యం మరియు గుర్తింపు సంఘం నాయకుల మధ్యన అధికారిక వ్రాతపూర్వక ఒప్పందం జరిగింది.అలాగే ఏదైనా ఉద్యోగి ఈ మధ్యకాలంలో మైన్ యాక్సిడెంట్కు గురి అయి చనిపోయి వారి వారసులకు జనరల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇచ్చినట్లయితే వారందరూ కూడా ఈ ఒప్పందం ప్రకారం సూటబుల్ ఎంప్లాయ్మెంట్ నాన్ టెక్నికల్ వారందరికీ గ్రేడ్ 3 క్లర్క్ (మినిస్ట్రియల్ స్టాఫ్) ఉద్యోగము కల్పించబడుతుంది. అందువల్ల అర్హులు ఎవరైనా ఉన్నాచో సర్కులర్ ప్రకారము దరఖాస్తు చేసుకోవాలి. సింగరేణి ఉద్యోగుల దృష్టిలో ఉన్న ప్రతి డిమాండ్ ను ఇప్పటికే స్ట్రక్చరల్ కమిటీలలో పెట్టి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి చర్చించి అన్ని డిమాండ్లను పరిష్కరించుటకు గుర్తింపు సంఘం కృషి చేస్తుంది. ఇప్పటికే కొన్ని ఒప్పందాలను అమలు చేస్తూ సర్కులర్లను యాజమాన్యం జారీ చేసింది. ఇంకా కొన్ని సర్కులర్లు రావాల్సి ఉన్నవి. మరియు కొన్ని డిమాండ్లు కమిటీలు వేసి కమిటీ రిపోర్ట్ ప్రకారం అమలు చేయుటకు యాజమాన్యం సిద్ధంగా ఉంది. దీనిని గని కార్మికులు దృష్టిలో ఉంచుకొని గుర్తింపు సంఘంపై విశ్వాసముంచాలని కోరుతున్నాము.సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్, ఎఐటియుసి.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :