Thursday, 14 May 2026 01:05:11 AM
# అశ్వారావుపేటకు హార్టికల్చర్ కళాశాల తీసుకొచ్చిన ఎమ్మెల్యే జారె. # అన్నపురెడ్డిపల్లి చెరువు వద్ద పేకాట శిబిరంపై పోలీసుల దాడిలో నలుగురు అరెస్ట్. # బి ఆర్ ఎస్ కమిటి ఆధ్వర్యంలో ఆందోళన చేసిన మండల ఉపాధ్యక్షులు మద్దిరాల చిన్న పిచ్చయ్య. # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే జారె. # సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించిన టేకులపల్లి ఎస్సై జుబేదా బేగం. # కలెక్టర్ చేతుల మీదుగా బ్యాటరీ వీల్ చైర్ పంపిణీ. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లాలో లాడ్జిలను నడిపించే యాజమాన్యాలు నిబంధనలను కచ్చితంగా పాటించాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # ఎన్సీసీ క్యాడెట్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు. # కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం వల్ల అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. ఎమ్మెల్యే జారె. # అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే జారె. # జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పర్సనల్ మేనేజర్ తిరుపతి నీ సన్మానించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. # పుల్లాయిగూడెం శ్రీసీతారామాంజనేయస్వామి ఆలయ పూజలో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు . # రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం గుండుగులపల్లి కార్యక్రమంలో వివరించిన ఎమ్మెల్యే జారె. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # విపత్తుల నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్‌లకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఆసుపత్రులు,డయాగ్నస్టిక్ సెంటర్లకు అనుమతులు తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ అంకిత్. # తమిళనాడు గవర్నర్ వ్యవహారం హాస్యాస్పదం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

జెడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల అభ్యర్థుల ఖర్చు పరిమితులు – గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో అధికారుల సమీక్ష.

Date : 06 October 2025 07:37 PM Views : 519

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జెడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థులు మరియు రాజకీయ పార్టీలు ఖర్చు చేయగల వ్యయ పరిమితులను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ సీఈఓ నాగలక్ష్మి మరియు డీపిఒ రాంబాబు సోమవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఎన్నికల ఖర్చు పరిమితులు మరియు వ్యయ పర్యవేక్షణపై సమీక్షా సమావేశం నిర్వహించారు.సమావేశంలో మాట్లాడిన సీఈఓ నాగలక్ష్మి మాట్లాడుతూ, అభ్యర్థులు ఎన్నికల ఖర్చు పరిమితులను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఎన్నికల కమిషన్ నిర్ధేశించిన ప్రకారం జెడ్పిటిసి అభ్యర్థులు రూ.4 లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థులు రూ.1.50 లక్షలు వరకు, సర్పంచ్ అభ్యర్థులు గ్రామపంచాయతీ జనాభా ఆధారంగా రూ.2.50 లక్షలు లేదా రూ.1.50 లక్షల వరకు వ్యయం చేయవచ్చని తెలిపారు.2011 జనాభా లెక్కల ప్రకారం 5 వేల జనాభా కంటే ఎక్కువ ఉన్న గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థికి రూ.2.50 లక్షలు, వార్డు సభ్య అభ్యర్థికి రూ.50,000ల వ్యయ పరిమితి, 5 వేల జనాభా కంటే తక్కువ ఉన్న గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థికి రూ.1.50 లక్షలు, వార్డు సభ్య అభ్యర్థికి రూ.30,000ల వ్యయ పరిమితి ఉంటుందని వివరించారు.డీపిఒ రాంబాబు మాట్లాడుతూ, అభ్యర్థులు పోటీ చేసే ప్రాంతంలో రాజకీయ పార్టీలు చేసే ప్రచార ఖర్చులు కూడా ఆయా అభ్యర్థుల ఎన్నికల ఖాతాలో చేర్చబడతాయని తెలిపారు. ప్రచారంలో వాహనాలు, మైక్ సెట్లు, పోస్టర్లు, బ్యానర్లు, పాంప్లెట్లు మొదలైన వాటి ఖర్చులు కూడా లెక్కలో చూపించాలని సూచించారు.ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్థి ఎన్నికల అనంతరం 45 రోజుల్లోపు తమ తుది ఖర్చు నివేదికలను సంబంధిత నియామక అధికారికి సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని, ఖర్చు పర్యవేక్షణ కమిటీలు, వీడియో సర్వైలెన్స్ టీములు కఠినంగా పర్యవేక్షణ జరపనున్నాయని తెలిపారు.ఈ సమావేశంలో డిప్యూటీ జెడ్పి సీఈవో చంద్రశేఖర్,ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లక్ష్మణ్ అగర్వాల్, భారతీయ రాష్ట్ర సమి తి అనుదీప్, సిపిఐ పార్టీ శ్రీనివాస్, భారతీయ జనతా పార్టీ నోముల రమేష్, సిపిఐ ( ఎం) సత్యనారాయణ మరియు సిపిఐ ( ఎం సి ) గౌరీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :