తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్)ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 163 వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన సిపిఐ అనుబంధ యువజన సంఘం (ఏఐవైఎఫ్) జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.కె ఖయ్యూం,ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు బరిగెల భూపేష్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు 1984 సంవత్సరం జనవరి 12 న భారత ప్రభుత్వం జాతీయ యువజన దినోత్సవం(నేషనల్ యూత్ డే) జరుపుతుందన్నారు, స్వామి వివేకానంద జనవరి 12, 1863, సంవత్సరంలో కలకత్తాలో జన్మించి మూఢనమ్మ కాలకతీతంగా హిందుత్వ అభివృద్ధికి కృషి చేస్తున్న రామకృష్ణ పరమహంస శిష్యుడిగా అంచలంచెలుగా ఎదుగుతూ 1893 లో అమెరికాలోని చికాగో పట్టణంలో ప్రపంచ విభిన్న మతాల సదస్సుకు హాజరై వివేకానంద మాట్లాడుతూ ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి మరియు ప్రపంచానికి అవసరమని స్వామి వివేకానంద అన్నారని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు జావిద్, మజ్జిగ రణధీర్, కొయ్యడ రవి, రసూల్ పాషా, బట్టు నరేష్, మజ్జిగ గిరి ప్రసాద్, శివ, కాజా, తరుణ్, వెంకట్, సతీష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ