Thursday, 14 May 2026 02:20:53 AM
# అశ్వారావుపేటకు హార్టికల్చర్ కళాశాల తీసుకొచ్చిన ఎమ్మెల్యే జారె. # అన్నపురెడ్డిపల్లి చెరువు వద్ద పేకాట శిబిరంపై పోలీసుల దాడిలో నలుగురు అరెస్ట్. # బి ఆర్ ఎస్ కమిటి ఆధ్వర్యంలో ఆందోళన చేసిన మండల ఉపాధ్యక్షులు మద్దిరాల చిన్న పిచ్చయ్య. # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే జారె. # సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించిన టేకులపల్లి ఎస్సై జుబేదా బేగం. # కలెక్టర్ చేతుల మీదుగా బ్యాటరీ వీల్ చైర్ పంపిణీ. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లాలో లాడ్జిలను నడిపించే యాజమాన్యాలు నిబంధనలను కచ్చితంగా పాటించాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # ఎన్సీసీ క్యాడెట్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు. # కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం వల్ల అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. ఎమ్మెల్యే జారె. # అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే జారె. # జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పర్సనల్ మేనేజర్ తిరుపతి నీ సన్మానించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. # పుల్లాయిగూడెం శ్రీసీతారామాంజనేయస్వామి ఆలయ పూజలో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు . # రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం గుండుగులపల్లి కార్యక్రమంలో వివరించిన ఎమ్మెల్యే జారె. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # విపత్తుల నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్‌లకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఆసుపత్రులు,డయాగ్నస్టిక్ సెంటర్లకు అనుమతులు తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ అంకిత్. # తమిళనాడు గవర్నర్ వ్యవహారం హాస్యాస్పదం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

రాష్ట్ర స్థాయిలో కబడ్డీ విజేతగా భద్రాద్రి జిల్లా బాలికల జట్టు

Date : 24 February 2025 04:30 PM Views : 746

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వికారాబాద్‌ జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన 34వ సబ్‌ జూనియర్‌ అంతర్రాష్ట్ర బాలబాలికల కబడ్డీ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జట్టు సత్తా చాటింది. కాగా వారిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ చీకటి కార్తీక్ అభినందించారు. వారికి మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా చీకటి కార్తీక్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి జిల్లాలోని క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి రాష్ట్ర స్థాయిలో సత్తా చాటేలా చేసేందుకు కృషి చేస్తున్నామని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహాయంతో జిల్లాలోని కబడ్డీ క్రీడాకారులకు సింథటిక్ మ్యాట్ తో కూడిన కబడ్డీ ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తే స్పోర్ట్స్ కోటాలో భవిష్యత్ లో మంచి హోదాతో కూడిన ఉద్యోగాలు పొందే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, జాతీయ స్థాయిలో రాణించి భద్రాద్రి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌ జాయింట్ సెక్రటరీ - భద్రాద్రి జిల్లా సెక్రటరీ కె స్వాతిముత్యం, ట్రెజరర్ నరేష్, కోచ్ సిహెచ్ రాంబాబు, వెంకట్, యూత్ కాంగ్రెస్ నాయకులు గులాం మతిన్, కుంచం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :