తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జనవరి 29 తెలుగు వెలుగు) : జూలూరుపాడుమండల పరిధిలోని అనంతారం గ్రామంలో గత కొన్ని నెలలు గా విద్యుత్తు, ఓవర్ లోడ్ సమస్యతో ప్రజల ఇబ్బందులు పడుతున్నారు . ప్రజల సమస్యను సత్వరమే పరిష్కార దిశగా అధికారులకు దృష్టికి తీసుకువెళ్లిన సర్పంచ్ కోర్సా రమేష్ విద్యుత్ అధికారుల సహాయంతో నూతన ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయించారు. సమస్యను పరిష్కరించినందుకు ade రవికుమార్, ae ప్రవీణ్, లైన్మెన్ వినోద్ కు గ్రామ సర్పంచ్ కోర్సా రమేష్ ధన్యవాదాల తెలియజేశారు. అలాగే గ్రామస్తులు సర్పంచ్ రమేష్ ను అభినందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రావెళ్ల సత్యం, గాజుల రామారావు గ్రామ లైన్మెన్ లు యదళ్లపల్లి వెంకటేశ్వర్లు, కుంజా గోపాల్ విద్యుత్ అధికారి వినోద్ మరియు గ్రామస్తులు ఉన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ