తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : )జూలూరుపాడు మండలంలోని పడమట నర్సాపురం గ్రామంలో గోసు రామారావు గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప దీక్షపరులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ కార్తీక్ మాసం ప్రారంభం అయిననాటి నుండి అయ్యప్ప దీక్ష తీసుకున్నాము ప్రతి రోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేచి చన్నీటి స్థానం ఆచరించి, సాయంత్రం సంధ్యవేళలో చన్నీటి స్థానం ఆచరించి పూజ, శరణ ఘోష చెప్పుకొని స్వామి వారి ఇచ్చి అనంతరం,స్వాములు మాలకు హారతి తీసుకొని నిత్య పూజ నిర్వహిస్తున్నారు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం స్వామి వారి భజన పాటలు పాడుతాము స్వామి అందరూ ఏక భుక్తం, (ఒక్కపూట భోజనం) రాత్రి హల్పాహం తీసుకున్నాము అని తెలిపారు. స్వామి వారి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని స్వామి వారిని వేడుకుంటున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ