Wednesday, 16 September 2026 04:45:02 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

ఘనంగా ప్రారంభమైన సాయుధ పోరాట వారోత్సవాలు

Date : 11 September 2026 04:26 PM Views : 45

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సాయుధ రైతాంగ పోరాటం అజరామరం నయా రాచరిక పాలకులపై ఉద్యమిద్దాం సాయుధ పోరాటంలో కాషాయ పాత్ర శూన్యం సమరశీల పోరాటాలతో అమరుల ఆశయాలు సాధిద్దాం : సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్ర అజరామరమైనదని, నాడు సాగిన వీరోచిత పోరాటాల స్ఫూర్తితో నేటి నయా రాచరిక పాలకులపై ఉద్యమించాల్సిన అవసరం ఉందని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా పిలుపునిచ్చారు. చారిత్రక తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ప్రారంభ సభ శుక్రవారం సుజాతనగర్ మండలం నాయకులగూడెం గ్రామంలో జరిగింది. పోరాటానికి పిలుపునిచ్చిన నేత రావి నారాయణరెడ్డి స్థూపం వద్ద పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాధం ఎర్రజెండాను ఆవిష్కరించిన అనంతరం నిర్వహించిన సభలో సాబీర్ పాషా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నిజాం నవాబు నిరంకుశ పాలనకు, దేశ్‌ముఖ్‌ల భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా సాగిన మహత్తర సాయుధ పోరాటం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. వెట్టిచాకిరీ విముక్తి కోసం, భుక్తి కోసం, 'దున్నేవాడికే భూమి' హక్కు కోసం వేలాది మంది కమ్యూనిస్టు యోధులు రక్తతర్పణం చేసి పేదలకు భూములను పంచిపెట్టారని గుర్తుచేశారు. ఆనాడు కమ్యూనిస్టుల రక్తంతో లిఖించబడిన మహోజ్వల పోరాట చరిత్రలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల పాత్ర ఇసుమంత కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. నాడు నయాపైసా త్యాగం చేయని మితవాద శక్తులు, నేడు సాయుధ పోరాటాన్ని హైజాక్ చేసేందుకు తెగబడుతుండటం సిగ్గుచేటన్నారు. వర్గ పోరాటాన్ని హిందూ–ముస్లిం గొడవగా చిత్రీకరిస్తూ, చరిత్రను వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. అమరుల ఆశయాలు నేటికీ నెరవేరలేదని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రజాస్వామ్య రక్షణ కోసం సమరశీల ఉద్యమాలను నిర్మించాలని కోరారు. అనంతరం నాయకులగూడెంలోని సాయుధ పోరాట యోధులు కొమారి రామయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కొమారి హన్మంతరావు అధ్యక్షతన జరిగిన సభలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాధం, మేయర్ మూడ్ గణేష్, రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు వి పూర్ణచందర్ రావు, కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, జి వీరాస్వామి, కందుల భాస్కర్, భూక్య దస్రు, జిల్లా సమితి సభ్యులు జక్కుల రాములు, భూక్య శ్రీనివాస్, కె రత్నకుమారి, వర్క అజిత్, నాయకులు ఎండి యూసుఫ్, సత్యనారాయణ చారి, దండు నాగేశ్వర్ రావు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు భూక్యా శాంతిశ్రీ, బోయిన విజయ్ కుమార్, బండి నర్సింహా, దుర్గయ్య, నిమ్మల రాంబాబు, వై ఎస్ గిరి, మల్లేష్, కేశవరావు, పొదిలి శ్రీను, గోరెంట్ల ధర్మ, కున్సోత్ శంకర్, కొమారి కృష్ణ, షాహీన్, మేదిని లక్ష్మి, కైసర్, షమీమ్, శ్రీను, రమేష్, కత్తి వెంకన్న, బాలు, లక్ష్మయ్య, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :