Thursday, 17 September 2026 11:55:24 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

కొమరయ్య ఆశయాలే కార్మిక ఉద్యమానికి బాట 30వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. ఎమ్మెల్యే కూనంనేని.

Date : 05 September 2026 06:53 PM Views : 114

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొమరయ్య ఆశయాలే కార్మిక ఉద్యమానికి బాట 30వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.పెన్షన్‌, బోనస్‌ వంటి హక్కులు ఆయన పోరాట ఫలితమే.సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట కొమరయ్య విగ్రహానికి ఎమ్మెల్యే కూనంనేని నివాళి కొత్తగూడెం, కార్పొరేట్‌ ఏరియాల్లో ఘనంగా వర్ధంతి కార్యక్రమాలు.సింగరేణి కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం జీవితాంతం పోరాడిన యూనియన్‌ కొమరయ్య సేవలు చిరస్మరణీయమని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు.కొమరయ్య 30వ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం కొత్తగూడెం,కార్పొరేట్ ఏరియాలోని వివిధ గనులు, విభాగాల వద్ద ఏఐటీయూసీ బ్రాంచ్‌ నాయకుల ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.కొమరయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. కార్మికుల జీవితాల్లో నేడు కనిపిస్తున్న అనేక సంక్షేమ హక్కుల వెనుక కొమరయ్య వంటి నాయకుల సుదీర్ఘ పోరాటం ఉందన్నారు. కార్మికుడు ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కూడా గౌరవప్రదంగా జీవించేందుకు పెన్షన్‌ సౌకర్యం ఉండాలన్న దృఢ సంకల్పంతో కొమరయ్య పోరాడారని తెలిపారు.అప్పట్లో కేవలం రూ.350తో ప్రారంభమైన పెన్షన్‌ నేడు వేలాది మంది కార్మికులు, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసాగా మారిందన్నారు.కార్మికుల భవిష్యత్‌ భద్రత కోసం పోరాడినందుకే ఆయనను కార్మికులు *‘పెన్షన్‌ ప్రదాత’*గా గౌరవంగా స్మరించుకుంటారని శాసనసభ్యులు పేర్కొన్నారు.బోనస్‌కార్మికులకు దీపావళి బోనస్‌ ఒక హక్కుగా లభించేందుకు కొమరయ్య చేసిన పోరాటాన్ని నాయకులు గుర్తుచేశారు. పండుగ సమయంలో కార్మిక కుటుంబాలకు అదనపు ఆర్థిక సహాయం అందాలన్న డిమాండ్‌ను బలంగా ముందుకు తీసుకెళ్లి బోనస్‌ హక్కు సాధనకు కృషి చేశారని తెలిపారు. కార్మికుల వేతనాలు, సంక్షేమం మాత్రమే కాకుండా వారి కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా అనేక అంశాలపై ఆయన ఉద్యమాలు సాగించారని అన్నారు.సింగరేణిలో కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యలపైనా కొమరయ్య ప్రత్యేకంగా దృష్టి సారించారని నాయకులు తెలిపారు.ఒకే సంస్థలో పనిచేస్తున్న కార్మికుల మధ్య వివక్ష ఉండకూడదనే భావనతో కాంట్రాక్ట్‌ కార్మికుల హక్కుల కోసం పోరాడారని, పలువురు కార్మికులను పర్మినెంట్‌ చేయించడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. కార్మిక సంక్షేమం, ఉద్యోగ భద్రత, హక్కుల పరిరక్షణ కోసం ఆయన చేసిన పోరాటాలు నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయన్నారు.కొమరయ్య తన జీవితాన్ని కార్మిక ఉద్యమానికే అంకితం చేశారని, పదవి, వ్యక్తిగత ప్రయోజనాల కంటే కార్మికుల సమస్యలకే ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు.అనారోగ్యంతో ఉన్న సమయంలోనూ కార్మికుల సమస్యల గురించే ఆలోచిస్తూ, తుది శ్వాస వరకు కార్మికుల కోసం పాటుపడిన మహానేతగా ఆయనను స్మరించుకున్నారు.కొమరయ్య సాధించిన హక్కులను కాపాడుకోవడంతో పాటు, భవిష్యత్‌లోనూ కార్మికులపై జరిగే అన్యాయాలకు వ్యతిరేకంగా ఏఐటీయూసీ పోరాటాలను కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు.ఉద్యమనేత కొమరయ్య స్ఫూర్తితో ఆర్ ఎల్ సి సమక్షంలో కార్మికుల శ్రేయస్సు కోసం అనేక కీలక డిమాండ్ల ను అగ్రిమెంట్లు ను జీర్ణించుకోలేక కొన్ని కార్మిక సంఘాలు దుష్ప్రచారం చేస్తున్నారని, దుష్ప్రచారం చేస్తున్న నాయకులు ఏ ప్రభుత్వం పచ్చగా ఉంటే అక్కడికి వెళ్ళి వాలిపోయే కార్మిక సంఘాల నాయకులు కూడా ఖండించడం విడ్డూరంగా ఉందని అన్నారు,ఇకనైనా కార్మికులకు ఉపయోగపడే అగ్రిమెంట్ల పై దృశ్ప్రచరం చేయడం మానుకోవాలని హెచ్చరించారు, కార్యక్రమాల్లో ఏఐటీయూసీ సీనియర్ నాయకులు శేషయ్య,కేంద్ర ప్రచార కార్యదర్శి వీరస్వామి, కొత్తగూడెం ఏరియా బ్రాంచ్‌ కార్యదర్శులు జక్కుల గట్టయ్య,రమణమూర్తి, సుధాకర్‌,ఉపాధ్యక్షులు కత్తర్ల రాములు,క్రిస్టోఫర్,సహాయ కార్యదర్శి సామల రాము,ఆఫీస్‌ బేరర్లు నితిన్,రవీందర్, సందబోయిన శ్రీనివాస్‌,గుమ్మడి వీరయ్య,హీరాలాల్‌, పిట్‌ కార్యదర్శులు మధుకృష్ణ, కమల్‌, భూక్య రమేష్‌,నరేష్,మెంగన్ రవి,ఏం శ్రీనివాస్, జే రమేష్,సుధీర్,అనంతలక్ష్మి,రామకృష్ణ,మల్లికార్జున్,కాంట్రాక్ట్ కార్మికుల ఇంచార్జి ఎర్రగాని క్రిష్ణయ్యః,నాయకులు రామచందర్,బండారి మల్లయ్య ,అప్పారావు,సందీప్‌, సాయి, పవన్‌, శశివర్ధన్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, రాజేశ్వరరావు, సాంబమూర్తి, గుమ్మడి మురళి,కరుణాకర్‌, కళ్యాణ్‌,అవినాష్‌, నాగరాజు, రాజ్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :