తెలుగు వెలుగు టీవీ - వార్తలు / సుజాతనగర్ : సుజాతనగర్ మండల అధ్యక్షుడుగా సీతంపేట గ్రామానికి చెందిన తడికమళ్ళ దిలీప్ ను నియమిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు గంధం మల్లిఖార్జున రావు నియామక పత్రాన్ని అందజేశారు.ఈసందర్భంగా దిలీప్ మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం మండలంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి పూర్తిస్థాయి బూత్ కమిటీల నియామకం చేస్తానని అదేవిదంగా త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని అన్ని పంచాయితీలలో బీఎస్పీ గెలుపునకు కృషి చేస్తానని తెలిపారు.ప్రజలకు కనీస అవసరాలైన విద్యా,వైద్యం అందించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయన్నారు.మండల కేంద్రంలో ప్రభుత్వ వైద్యులు 24గంటలు అందుబాటులో వుండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.తనపై నమ్మకంతో మండల అధ్యక్ష భాద్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్,జిల్లా అధ్యక్షులు గంధం మల్లిఖార్జున రావు లకు ధన్యవాదాలు తెలిపారు.మండల అధ్యక్షుడిగా నియమితులైన ఆయనను గుండేటి ఆదినారాయణ,కాకటి బాబు,నాగుల రవికుమార్,విష్ణు తదితరులు అభినందనలు తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ