Friday, 18 September 2026 05:24:13 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

ప్రకృతి మాతను కాపాడుకుందాం. ప్రముఖ ప్రకృతి కవి జయరాజు.

Date : 16 February 2026 07:45 PM Views : 386

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ భూమిపైన సమస్త జీవరాశి కనుమరుగయ్యే కాలం ఆసన్నమైందని, ప్రకృతి మాతను కాపాడుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉందని, ప్రముఖ ప్రకృతి కవి రచయిత డాక్టర్. జయరాజ్ అన్నారు.విజ్ఞాన దర్శని, దీ నెహ్రూ సెంటర్, నేచర్ ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన విజ్ఞాన యాత్రలో భాగంగా, యాత్ర బృందం శనివారం కొత్తగూడెం చేరుకుంది. ఈ సందర్భంగా ప్రకృతి ఆశ్రమంలో ఏర్పాటు చేసిన ప్రకృతి ప్రేమికుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అనేక పోరాటాల త్యాగ ఫలితంగా స్వాతంత్రం సిద్ధించిందని, దాన్ని సఫలీకృతం చేసేందుకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అందించారనీ వెల్లడించారు. ఇటీవల రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర జరుగుతుందని దాన్ని అర్థం చేసుకుని, రాజ్యాంగ రక్షణకు పాటుపడాలని కోరారు. ప్రపంచంలో క్యాన్సర్ వీరవిహారం చేస్తున్నదని, ప్రాణాంతకమైన క్యాన్సర్ని రూపుమాపేందుకు మనమందరం నిత్యజీవితంలో ప్లాస్టిక్ ని రూపు మాపాల్సిన అవసరం ఆసన్నమైందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రకృతి పైన, రాజ్యాంగం పైన, సైన్స్ పైన, అవగాహనను కల్పించాల్సిన అవసరం ఏర్పడిందని, దాని దానిలో అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం విజ్ఞాన దర్శిని వ్యవస్థాపకులు, ప్రజా వైజ్ఞానికవేత్త రమేష్ మాట్లాడుతూ సైన్సు సాంకేతిక రంగాలలో ప్రపంచం దూసుకుపోతుందని, ప్రస్తుతం ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కాలం ఆసన్నమైంది కానీ, మనుషుల్లో మార్పు రాలేదన్నారు. ఒక మెకానికల్ ఇంజనీర్ తన కారుకి చిన్న నట్టు పోతే వేసుకోలేని పరిస్థితి వచ్చింది అన్నారు. ఎలక్ట్రికల్ లో ఇంజనీరింగ్ పట్టాపుచ్చుకున్నవారు తన ఇంట్లో ఫీజు పోతే వేసుకోలేని పరిస్థితి ఉందని, దాన్నిబట్టి మనం చదివే చదువుల వల్ల ఉపయోగం ఏంటో అర్థం చేసుకోవాలని కోరారు. చదువులతో పాటు సమాజాన్ని చదవాలని అభివృద్ధి చెందుతున్న సైన్స్ ని అందిపుచ్చుకోవాలని అప్పుడు మాత్రమే మన జీవితాల్లో మార్పు సాధ్యమవుతుందని ఆయన తెలిపారు అనంతరం ప్రకృతి ఆశ్రమం సభ్యుల ఆధ్వర్యంలో డాక్టర్ జయరాజుకు, విజ్ఞాన దర్శిని వ్యవస్థాపకులు రమేష్_ శోభారాణి దంపతులకు, అవయవ దానం పై అవగాహన కల్పిస్తున్న అమ్మ నేత్ర శరీర అవయవదాన సంఘం రాష్ట్ర కన్వీనర్ ఈశ్వర్ లింగం లను ఆశ్రమ సభ్యులు ఘనంగా సన్మానించి, సత్కరించారు. కన్వీనర్ సుగుణా రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆశ్రమం నిర్వాహకులు కేహెచ్ ప్రసాద్ మాట్లాడుతూ విజ్ఞాన యాత్ర చేపట్టడం శుభదాయకమన్నారు.యాత్రకు కొత్తగూడెం ప్రకృతి ఆశ్రమం ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన దర్శిని జాతీయ నాయకురాలు శోభారాణి, రాష్ట్ర కార్యదర్శి మెహర్ అలీ, ప్రకృతి ఆశ్రమం సభ్యులు శనగ వెంకటేశ్వర్లు, మల్లెల రామనాథం, మొక్కల రాజశేఖర్, ఎల్దండి పూర్ణచంద్రరావు, దయానంద సాగర్, బంగారి శంకర్, బిక్కులాల్, నంది శశి కుమార్, శోభారాణి, రఘు లు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :