Thursday, 17 September 2026 10:41:55 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

ఈనెల 23న కమ్మ సేవా సమితిలో సింగరేణి పరిరక్షణ సదస్సు.విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రాజిరెడ్డి.

Date : 19 June 2026 07:21 PM Views : 164

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈనెల 23న కమ్మ సేవా సమితిలో సింగరేణి పరిరక్షణ సదస్సు.సింగరేణి సంస్థలో జరుగుతున్న పరిణామాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్.హాజరుకానున్న హరీష్ రావు, తెలంగాణ బొగ్గు పని కార్మిక సంఘం నాయకులు.విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రాజిరెడ్డి.ఈనెల 23న కొత్తగూడెం కమ్మ సేవా సమితిలో సింగరేణి పరిరక్షణ సదస్సు ఉంటుందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి తెలిపారు. శుక్రవారం కొత్తగూడెం టీబీజీకేఎస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. సింగరేణి సంస్థలో జరుగుతున్న పరిణామాల పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆ సదస్సులో ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. మెడికల్ బోర్డు ఎప్పుడు పెడతారని, 15 నెలలుగా ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదన్నారు. అలాగే జులై, నవంబర్, మే లో జరిగిన అడ్వైస్డ్ రివ్యూ బోర్డు రిపోర్టును ఎందుకు విడుదల చేయలేదని అడిగారు. మారుపేరుల సమస్యకు పరిష్కారం చూపుతారా..? 250 గజాల ఇళ్ల స్థలం ఇస్తారా లేదా..? రియంబర్స్మెంట్ ఉంటుందా లేదా అని పలు ప్రశ్నలు సంధించారు. 20 నుంచి 30 లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తారా లేదా అని అడిగారు. ఈ అన్ని అంశాలపై ఈనెల 23న కొత్తగూడెం కమ్మ సేవాసమితిలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారని తెలియజేశారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తక్కెళ్ళపల్లి రవీందర్రావు, తాత మధుసూదన్, జిల్లాలోని ఐదు నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు హజారవుతారని చెప్పారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :