Thursday, 17 September 2026 11:34:38 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 01 October 2025 07:32 PM Views : 285

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ బుధవారం పాల్వంచ మండలం తోగూడెం–2 అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించారు. అంగన్వాడి కార్యకలాపాలను ప్రత్యక్షంగా పరిశీలించి, పోషణ్ వాటిక (Nutrition Garden) ఏర్పాటు విషయమై అవసరమైన సూచనలు, సలహాలు అందజేశారు. ప్రతి అంగన్వాడి కేంద్రంలో పోషకాహారానికి తోడ్పడే కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలు నాటాలని, వాటిని సమర్థవంతంగా సంరక్షించడం ద్వారా చిన్నారులు మరియు గర్భిణి, పాలిచ్చే తల్లులకు పౌష్టిక విలువలతో కూడిన ఆహారం అందేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సందర్భంగా కలెక్టర్ తల్లి–శిశు ఆరోగ్యంపై విశేషంగా చర్చించారు. ముఖ్యంగా ఇంటికి తీసుకెళ్లే పౌష్టికాహారం పంపిణీ విధానం పై సమీక్ష జరిపి, తల్లుల నుండి నేరుగా “బాలామృతం” వినియోగం ఎలా జరుగుతోంది? పిల్లలు తీసుకుంటున్నారా? ఏమైనా సమస్యలు ఉన్నాయా? అన్న అంశాలను వివరంగా అడిగి తెలుసుకున్నారు. తల్లులు అందిస్తున్న సమాధానాలను శ్రద్ధగా విని, అవసరమైన చోట తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.పోషకాహార లోపం రాకుండా అంగన్వాడి కేంద్రాలు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. ప్రతి అంగన్వాడి కేంద్రం సమయానికి ఇంటికి తీసుకెళ్లే పౌష్టికాహారం అందించడంతో పాటు చిన్నారులు ఆహారం తీసుకునేలా పర్యవేక్షించాలి. పోషణ్ వాటికల ద్వారా స్వయం పూర్ణత సాధించడమే లక్ష్యం కావాలి” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీడీపీఓ, ఎంపీడీఓ, సూపర్వైజర్ అశోక , ఏపీఓ తదితర అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :