తెలుగు వెలుగు టీవీ - వార్తలు / సుజాతనగర్ : పాత కక్షలను దృష్టిలో ఉంచుకొని దాడి చేసిన ఘటనలో ముగ్గురిపై సుజాతనగర్ పోలీస్ స్టేషన్లో శనివారం కేసు నమోదయింది. ఎస్సై జుబేదా బేగం తెలిపిన వివరాల ప్రకారం.. రాఘవాపురం గ్రామానికి చెందిన నాలం సంజయ్, అదే గ్రామానికి చెందిన సాగర్ కుటుంబాల మధ్య గతంలో గొడవలు జరిగాయి. ఈ గొడవలను దృష్టిలో ఉంచుకొని సాగర్, రాహుల్, శ్రీకాంత్లతో కలిసి నాలం సంజయ్ అతని తాత సారయ్యపై శనివారం దాడి చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు
Admin
తెలుగు వెలుగు టీవీ