Monday, 03 August 2026 07:05:30 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

స్వచ్ఛ సర్వేక్షణ్‌ లో భాగంగా ఐదు రోజుల కార్యాచరణ పాటించాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 19 July 2025 07:01 PM Views : 604

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : స్వచ్ఛ సర్వేక్షణ్‌ – 2025 లో భాగంగా గ్రామాల పరిశుభ్రతను పెంపొందించేందుకు ఐదు రోజుల కార్యాచరణను అమలులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. శనివారం ఆయన స్వచ్ఛ సర్వేక్షణ్‌ పై టెలీకాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగాకలెక్టర్ మాట్లాడుతూ, గ్రామాలలో స్వచ్ఛత పెంపొందించేందుకు స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వే ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమం కింద ప్రతి వారం ఐదు రోజుల కార్యాచరణను పాటించాలని సూచించారు. సోమవారం రోజున బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు వంటి ఖాళీ ప్రదేశాల్లోని పిచ్చి మొక్కలను తొలగించి, వాటి స్థానంలో ప్రజలకు ఉపయోగపడే మొక్కలను నాటాలని ఆదేశించారు. మంగళవారం తడి చెత్త–పొడి చెత్త వేరు చేయడం వల్ల లాభాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇక నుంచి ప్రతి మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లోనే పొడి చెత్తను సేకరించాలని తెలిపారు. బుధవారం రోజున ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో పనికిరాని వస్తువులను తొలగించడం, నీటి నిల్వలు లేకుండా చూసేలా చర్యలు తీసుకోవడం, నీటి నిలువుదల చోట్ల ఇంకుడు గుంతలు త్రవ్వే పనులు చేయాలని సూచించారు. గురువారం రోజున డ్రైనేజీల శుభ్రత, దోమల నివారణకు మందుల పిచికారీ, కమ్యూనిటీ మరుగుదొడ్ల శుభ్రత చేపట్టాలని చెప్పారు. శుక్రవారం నాడు ప్రతి ఇంటి ఆవరణంలో మరుగుదొడ్ల శుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వేలో ఇండ్లలో మరుగుదొడ్ల వాడకం, తడి–పొడి చెత్త వేరు చేయడం, కంపోస్టు షెడ్ల నిర్వహణ, మురుగు నీటి ప్రవాహం, పారిశుద్ధ్యం వంటి అంశాలను పరిశీలిస్తారు. ఐదు రోజుల కార్యాచరణ ద్వారా గ్రామాల్లో పరిశుభ్రత పాటించడం మరింత సులభతరం అవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.రానున్న బుధవారం లోపు ప్రతి గ్రామపంచాయతీలో మ్యాజిక్ సోక్ పిట్లు పూర్తిగా నిర్మించాలి. అలాగే, పిచ్చి మొక్కల నుండి వచ్చిన వ్యర్థాలతో బయోచార్ తయారు చేసి, దానిని మరుగునీటి శుభ్రత, దోమల నివారణకు ఉపయోగించవచ్చని సూచించారు. ప్రతి గ్రామంలో ఏబీసీడి డ్రైవ్‌ల పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వనమోత్సవ లక్ష్యాలను కూడా వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :