Wednesday, 16 September 2026 05:58:02 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు – పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 20 June 2026 07:23 PM Views : 169

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆదివారం నిర్వహించనున్న నీట్ (NEET) పరీక్షకు సంబంధించి జిల్లాలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. శనివారం అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌తో కలిసి పరీక్షా కేంద్రాలను పరిశీలించారు.పరిశీలనలో భాగంగా జిల్లాలో ఏర్పాటు చేసిన నాలుగు పరీక్షా కేంద్రాలైన టీజీఎస్‌డబ్ల్యూఆర్ బాలికల పాఠశాల మరియు జూనియర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాల పాల్వంచ, శ్రీ రామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కొత్తగూడెం, సింగరేణి ఉమెన్స్ కళాశాల కొత్తగూడెంలలో కలెక్టర్ తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ కౌంటర్లు, బయోమెట్రిక్ ధృవీకరణ కేంద్రాలు, పరీక్షా గదులు, భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, స్ట్రాంగ్ రూమ్ నిర్వహణ, జామర్ల ఏర్పాటు, అలారాలు, గోడ గడియారాలు తదితర అంశాలను నిశితంగా పరిశీలించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావు లేకుండా అన్ని చర్యలు చేపట్టాలని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న నీట్ పరీక్షకు మొత్తం 1,128 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో సెక్షన్-163 అమల్లో ఉంటుందని అన్నారు . పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ కేంద్రాలను పరీక్షా సమయాల్లో మూసివేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఉదయం 11 గంటల నుంచి అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించడం జరుగుతుందని, అభ్యర్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ప్రతి అభ్యర్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సెల్‌ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, బ్లూటూత్ పరికరాలు, కాలిక్యులేటర్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రాల్లోకి తీసుకురావద్దని అభ్యర్థులకు సూచించారు.పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లు సహా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామని కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని శాఖల సమన్వయంతో అవసరమైన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. పరీక్షల నిర్వహణలో పాల్గొనే అధికారులు, సిబ్బంది పూర్తి బాధ్యతతో విధులు నిర్వర్తించి పరీక్షలను విజయవంతం చేయాలని ఆదేశించారు.ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట కొత్తగూడెం ఆర్ డి ఓ మధు, తాసిల్దార్లు ధారా ప్రసాద్, పుల్లయ్య, జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :