తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సోమవారం సాయంత్రం బోడగుట్టకు చెందిన ఖలీల్ పాషా బస్టాండ్ ప్రాంతంలోని ఆర్టిసీ బంక్ వద్ద జరిగిన ద్విచక్రవాహన ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ట్రాఫిక్ ఎస్సై గడ్డం ప్రవీణ్ కుమార్ తక్షణమే స్పందించి ఖలీల్ పాషాను తన వాహనంలో ఆస్పత్రికి తీసుకుని వెళ్లి అక్కడ ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రమాదం గురించి సమాచారం అందించారు. మానవత్వంతో స్పందించి దగ్గరుండి ఆసుపత్రికి తరలించిన ఎస్సై ప్రవీణ్ కుమార్ కు క్షతగాత్రుడు ఖలీల్ కుటుంబ సభ్యులతో పాటుగా ఘటన స్థలంలో ఉన్న ప్రజలు కృతజ్ఞతలు తెలిపి అభినందించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ