Thursday, 17 September 2026 07:02:02 PM
# శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్

బడ్జెట్ సమావేశాల్లో కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలను నిర్ణయించాలి - AITUC కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య.

Date : 13 March 2025 01:06 PM Views : 779

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలోనైన కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలను 21000/-లకు తగ్గకుండా నిర్ణయించాలని ఏఐటీయుసి నాయకులు డిమాండ్ చేశారు. గురువారం నాడు సింగరేణి కొత్తగూడెం ప్రధాన కార్యాలయంలో జరిగిన కాంట్రాక్ట్ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ - AITUC కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య,ఉపాధ్యక్షులు కే డబ్ల్యూ కిష్టాఫర్ లు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటుతున్నప్పటికీ కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచకపోవడం వల్ల తీవ్ర ఆందోళన చెందుతున్నారని,ఈ బడ్జెట్ సమావేశాల్లో నైనా కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 21000/-లకు తగ్గకుండా చెల్లించేట్లుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు.ఈనెల 7వ తేదీన హైదరాబాద్ సింగరేణి భవన్ లో జరిగిన స్ట్రక్చరల్ సమావేశాల్లో గుర్తింపు కార్మిక సంఘం-AITUC నాయకులు మరియు గౌరవాధ్యక్షులు కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ కూనంనేని సాంబశివరావు గారు కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలను పెంచి తక్షణమే అమలు చేయాలని,కాళీ క్వార్టర్స్ ను కాంట్రాక్ట్ కార్మికులకు కేటాయించాలని,సింగరేణి లో అమలు చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల గైర్ హజరు పై పెనాల్టీ విధానాన్ని రద్దు పరచాలని,ESI ను అమలు చేయాలని యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చినట్లుగా నాయకులు తెలిపారు.కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుదలకు ఒకవైపున ప్రభుత్వంపై మరియు యాజమాన్యంపై పోరాడుతూనే మరోవైపున చర్చల ద్వారా గుర్తింపు కార్మిక సంఘం తరఫున ఒత్తిడి తీసుకొస్తున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు దేని ఆధారంగా వేతనాల పెంచడానికి అవకాశాలు ఉన్నాయో,మెరుగైన వేతనాలు చెల్లించడానికి పరిష్కారం కై ఏఐటియుసి ప్రయత్నం చేస్తుందని తెలిపారు.18 రోజుల సమ్మె సందర్భంగా ఒప్పందంలోని పెండింగ్ అంశాలను పరిష్కరించుకోవడానికి, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ప్రత్యేకమైన వేతనాలను సాధించుకోవడానికి కాంట్రాక్ట్ కార్మికులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ఎం చంద్రశేఖర్,సిహెచ్ శ్రీను,గోపి,సురేష్,కళావతి, పద్మ,లక్ష్మి,ఆదిలక్ష్మి పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :