Thursday, 17 September 2026 11:02:00 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రజా ప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం విజయవంతం చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 11 March 2026 07:57 PM Views : 399

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రేపు నిర్వహించు సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, చైర్మన్‌లు, వైస్ చైర్మన్‌లకు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజలకు చేరవేయడంలో ప్రజా ప్రతినిధుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు .నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు సహా ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పూర్తి అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందువల్ల ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రజలకు లబ్ధి చేకూర్చే వివిధ పథకాలు, వాటి అమలు విధానం, లబ్ధిదారులు వాటిని ఎలా పొందగలరు వంటి అంశాలపై సమగ్రంగా వివరించాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రజా ప్రతినిధుల పాత్రపై స్పష్టమైన అవగాహన కల్పించడంతో పాటు 99 రోజుల ప్రజాపాలన కార్యాచరణ ప్రణాళికపై కూడా పూర్తి వివరాలు తెలియజేయాలని సూచించారు.ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అమలు చేస్తున్న 10 ప్రధాన అంశాలు, వాటి ప్రాధాన్యతను ప్రజా ప్రతినిధులకు వివరించాలని తెలిపారు. మహిళలు, పిల్లల సంరక్షణకు సంబంధించిన చట్టాలు, హెల్ప్‌లైన్ నంబర్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతి, ఉచిత విద్యుత్ సదుపాయం,మహాలక్ష్మి పథకం,అలాగే విద్య, వైద్య శాఖల ద్వారా అమలు చేస్తున్న నూతన విధానాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. గ్రామాల వారీగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఎంతమంది లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారో సంబంధిత వివరాలు కూడా అందించాలని సూచించారు.శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమానికి తగిన సౌండ్ సిస్టమ్, ఎల్ఈడి స్క్రీన్‌లు, భోజనం, అల్పాహారం, స్నాక్స్ తదితర ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండేలా చూడాలని చెప్పారు. వైద్య శాఖ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయాలని, కార్యక్రమానికి హాజరయ్యే ప్రజా ప్రతినిధుల కోసం ప్రత్యేక రిజిస్ట్రేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి ఐడి కార్డులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :