Wednesday, 16 September 2026 09:53:03 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

ప్రాజెక్ట్ ప్రభావిత గ్రామాల మహిళలకు ఇచ్చిన తేనెటీగల పెంపకపు ప్రాజెక్ట్ పురోభివృద్ధి ని సమీక్షించిన కొత్తగూడెం ఏరియా జిఎం.

Date : 12 November 2025 07:29 PM Views : 248

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : C&MD ఎన్. బాలరాం, IRS మార్గదర్శకత్వంలో ఎం షాలెం రాజు, జనరల్ మేనేజర్, కొత్తగూడెం అధ్వర్యంలో చేపట్టిన తేనెటీగల పెంపకం శిక్షణా కార్యక్రమం ఒక మైలురాయిగా నిలిచింది. CSR కార్యక్రమం కింద మనబ్ కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ, త్రిపుర సహకారంతో 100 మంది మహిళలు ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకొని, మూడు రోజుల సమగ్ర శిక్షణ ఇచ్చి వారికీ C&MD ఎన్. బాలరాం, IRS చేతుల మీదుగా వారికి అని బాక్స్ లను మరియు వాటికీ సంబంధించిన కిట్లను ఇవ్వడం జరిగింది. బుధవారం గరీంపేట్ నందు తేనెటీగల పెంపకం కొరకు ఇచ్చిన బాక్సులను పర్యవేక్షించి తేనెటీగల బాక్స్ నుండి తయారైన తేనెను ఎలా తీయాలో సంబంధిత మనబ్ కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ, త్రిపుర వారిచే తేనెను తీయు కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం సాలెం రాజు, జిఎం (ఎన్విరాన్మెంట్) బి. సైదులు హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తేనెటీగల పెంపకం – ప్రకృతి , పంటల రక్షకుడు మరియు తేనె అనేది ఆరోగ్యాన్ని కాపాడే సహజ ఆహార పదార్థం మాత్రమే కాకుండా ప్రతిరోజు మన ఆరోగ్య జీవన శైలికి ఎంతో తోడ్పడుతుందని తేనెటీగల పరాగసంపర్కం (Pollination) ద్వారా వ్యవసాయ పంటల దిగుబడి పెరుగుతుందని, రైతులకు అధిక ఆదాయం లభిస్తుంది, పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో తేనెటీగల పాత్ర అనివార్యం, అందువల్ల ఈ వ్యవసాయ పద్ధతి ప్రకృతితో మమేకమయ్యే ఒక సుస్థిర మార్గం అన్నారు.అలాగే ఈ శిక్షణ ద్వారా మహిళలు, తమ ఇళ్ల వద్దే తేనెటీగల పెంపకం చేసి అదనపు ఆదాయాన్ని పొంధి ఆర్థికంగా స్వావలంబన సాధించగలరని కుటుంబాలను అభివృద్ధి చేసి, సమాజానికి మార్గదర్శకులుగా నిలవగలరని, శిక్షణా కార్యక్రమం పూర్తైన తర్వాత, అన్ని లబ్ధిదారులకు ఉచితంగా తేనెటీగల పెంపక బాక్స్ మరియు అవసరమైన కిట్ (Face Protection Mask, Gloves, Bee Handling Equipment Box) తప్పక ధరించి తేనెను తీయాలని శిక్షణ పొంది ఈ కార్యక్రమానికి హాజరైన మహిళలకు తెలియజేశారు , అదనంగా ఏవైనా సందేహాలు లేదా సూచనల కోసం, మనబ్ కళ్యాణ్ వెల్ఫేర్ బృందం రెండు సంవత్సరాల పాటు నిరంతర మార్గదర్శకత్వం మరియు సాంకేతిక సహాయాన్ని అందిస్తుందని, లబ్ధిదారులకు సులభంగా సేవలు అందించడానికి మన ప్రాంతంలో వారి ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారని తేలియజేసారు. అలాగే ఈ కార్యక్రమం మహిళలకు ఉపాధి మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసం మరియు గౌరవప్రదమైన జీవన విధానాన్ని ఉపాధిని మాత్రమే కాకుండా, వారి జీవితాలను సుస్థిరత, గౌరవం మరియు ఆత్మవిశ్వాసంతో నింపుతుందని మాకు గట్టి నమ్మకం కూడా అందిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో జిఎం (ఎన్విరాన్మెంట్) బి సైదులు, డిజిఎం (పర్సనల్) జి.వి. మోహన్ రావు, ఎస్ఓఎం ఎన్విరాన్మెంట్ కొత్తగూడెం ఏరియా టి.సత్యనారాయణ, మేనేజర్ (ఫారెస్ట్రీ) రమణారెడ్డి, మేనేజర్ ( ఫారెస్ట్) డేవిడ్ అభిలాష్, డివై పిఎం జి. హరీష్, మనబ్ కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ (ట్రైనర్స్) మరియు మహిళా అభ్యర్థులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :