Thursday, 17 September 2026 02:57:19 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

కొత్తగూడెం కార్పొరేషన్ లో పారిశుద్ధ్య పనులు మెరుగుపరచాలి కాపు సీతాలక్ష్మి

Date : 23 June 2025 02:34 PM Views : 632

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారత రాష్ట్ర సమితి పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆదేశాలు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు సూచన మేరకు సోమవారం కొత్తగూడెం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కొత్తగూడెం మున్సిపాలిటీ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం కొత్తగూడెం కార్పొరేషన్ మేనేజర్ ప్రసాద్ కు సమస్యలతో పోయిన వినతిపత్రం అందజేశారు. ఈ నిరసన ధర్నాలో సీతా లక్ష్మీ మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్యన్ని మెరుగుపరచాలని అన్నారు. వెంటనే దోమల నివారణకు దోమల మందు పిచికారి చేయించాలని సూచించారు. కొత్తగూడెంలో అర్హులైన పేదలందరికీ తక్షణమే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెం పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను నోటీస్ బోర్డులో ప్రదర్శించాలని కోరారు. అన్ని వీధుల్లో వీధి దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. డ్రైనేజీలో పేరుకుపోయిన వ్యర్ధాలను వెంటనే తొలగించాలని చెప్పారు. మిషన్ భగీరథ పథకం కోసం ఎక్కడికక్కడ పైప్ లైన్ ల కోసం తవ్విన గుంటలను పూడ్చి రోడ్లకు మరమ్మతులు చేపట్టాలి. తవ్విన గుంటల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదాన్ని సీఎం రేవంత్ రెడ్డి మరిచారని విమర్శించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాలని తెలిపారు.

ఈ నిరసన ధర్నాలో మాజీ కౌన్సిలర్లు ప్రసాద్, పల్లపు రాజు, మైనారిటీ సెల్ నాయకులు ఖాజా భక్ష్, మునీర్, హుస్సేన్, ఎస్సీ సెల్ రామిళ్ళ మధు, ఎస్టీ సెల్ నాయకులు పూర్ణచందర్, అజ్మీరా విజయ్, రాజ మల్లయ్య, షమ్మీ, మొయినుద్దీన్, సూరి, అశోక్, నగేష్, బాబు జానీ, నాగ రాజు, మజీద్, అన్వర్ ఖాజా, తుంగ కనకయ్య, ఆర్ శ్రీనివాస్, శ్రీదేవి, శైలజ, కోమల, శ్రీనిజ, సుందర్ పాసి, టింకు, సోనీ పాసి, సౌజన్య, ఆశ, మాధవి, స్వర్ణ, లక్ష్మి, కమల, విజయ, జి విజయ, సుహాని, మహేశ్వరి, రమణ, శ్రావణ్, నసీమా, మహబూబ్, షేక్ బాజీ, షేక్ బిబి, సత్యవతి, ఖంరుణ్నిసా, షణ్ముఖ, సిద్దు, బన్ను, అమన్, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :