Wednesday, 16 September 2026 07:38:14 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

ఆంధ్రాలో విలీనం చేసిన ఐదు పంచాయతీలను తెలంగాణకు అప్పగించాలి

Date : 07 August 2026 05:54 PM Views : 119

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : - శ్రీ రాముడు ఇక్కడ భూములు అక్కడ - పోలవరంతో భద్రాద్రి కి పెనుముప్పు - సీతారామ సీతమ్మధార ప్రాజెక్టుల ద్వారా జిల్లాకు సాగునీళ్ళు ఇవ్వాలి - ఇసుక లారీల వల్ల దెబ్బ తిన్న రోడ్డును బాగు చేయాలి - ఎస్.కే. సాబీర్ పాషా ప్రజాపక్షం/ భూర్గంపాడు/ భద్రాచలం/ దుమ్ముగూడెం/ చర్ల : రాష్ట్ర విభజన సమయంలో అశాస్త్రీయంగా ఆంధ్రాలో కలిపిన 5 గ్రామపంచాయ తీలను తెలంగాణ తిరిగి ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా అన్నారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా రెండవ రోజు యాత్ర శుక్రవారం బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక లో ప్రారంభమై భద్రాచలం మీదుగా దుమ్ముగూడెం చర్ల మండలాలను కలుపుకొని చర్ల మండల పరిధిలోని తిప్పాపురం గ్రామంలో ముగిసింది. ఈ ప్రజా చైతన్య యాత్రకు భద్రాచలం దుమ్ముగూడెం చర్ల మండలాలలో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా నాయకులకు పూలమాలలు వేసి హారతులు పట్టి ఆహ్వానం పలికారు. భద్రాచలం పట్టణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన నాయకులు తూర్పాక గ్రామంలో జయరామరెడ్డి స్మారక స్థూపానికి నరసాపురం గ్రామంలో రావులపల్లి నాగభూషణం స్మారక స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎర్రజెండాలతో దారి పొడవున సాగిన మోటార్ సైకిల్ ర్యాలీలు పాదయాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దారి పొడవునా అరుణ ప్రతాకాలను నాయకులు ఎగరవేశారు. ప్రజానాట్యమండలి ఆటపాట ఉత్సాహాన్ని కలిగించింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ భాష మాట్లాడుతూ ప్రజల హక్కులు, అస్తిత్వం, గిరిజనుల భవిష్యత్తును కాపాడేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పాషా స్పష్టం చేశారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం తెలంగాణలో ఉండగా, దేవస్థానానికి చెందిన భూములు, ఆస్తులు ఆంధ్రప్రదేశ్‌లో ఉండడం చారిత్రకంగా, పరిపాలనా పరంగా, ఆధ్యాత్మికంగా సమంజసం కాదన్నారు. "రాముడు ఇక్కడ... భూములు అక్కడ" అనే విరుద్ధ పరిస్థితికి కేంద్ర, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ముగింపు పలకాలని కోరారు. సీతారామ, సీతమ్మదార ప్రాజెక్టులను ద్వారా జిల్లాకు సమృద్ధిగా సాగునీరు అందించి అ తర్వాత తరలించుకు పోవాలని చెప్పారు. అలాగే ఎన్నో ఏళ్లుగా నిరీక్షణలో ఉన్న ప్రగల్లపల్లి ఎత్తిపోతల పథకానికి వెంటనే నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. పోలవరం ప్రాజెక్టు భద్రాద్రి జిల్లా మనుగడకే పెను సవాలుగా మారిందని పాషా ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాక్‌వాటర్ ప్రభావంతో గిరిజన గ్రామాలు, వ్యవసాయ భూములు, అడవులు, జీవనాధారాలు ప్రమాదంలో పడుతున్నాయని పేర్కొన్నారు. భద్రాద్రి ప్రజల ఆస్తులు, ప్రాణాలు, హక్కులను కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి వర్షాకాలంలో గోదావరి వరదలు భద్రాచలం పట్టణంతో పాటు అనేక గ్రామాలకు శాపంగా మారుతున్నాయని, అయినప్పటికీ శాశ్వత పరిష్కారంపై పాలకులు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని విమర్శించారు. గోదావరి వరద ముంపు నుంచి ప్రజలను రక్షించేందుకు నదీ తీరంలో శాస్త్రీయ ప్రమాణాలతో బలమైన కరకట్టలు నిర్మించి శాశ్వత వరద నియంత్రణ ప్రణాళికను అమలు చేయాలని డిమాండ్ చేశారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో వైద్యుల కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ ఖాళీల భర్తీపై ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని స్పెషాలిటీల్లో వైద్యులను వెంటనే నియమించి అవసరమైన సదుపాయాలు కల్పించాలని కోరారు. తరతరాలుగా సాగు చేస్తున్న గిరిజన రైతులకు పొడు భూములపై పెండింగ్ హక్కు పట్టాలు వెంటనే ఇవ్వాలని, అటవీ హక్కుల చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇసుక లారీల కారణంగా వాజేడు నుండి భద్రాచలం వరకు ఉన్న ప్రధాన రహదారి అద్వాన్నంగా తయారైందని కాంట్రాక్టర్లు కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ ఏజెన్సీ రహదారులను సర్వనాశనం చేస్తున్నారని వెంటనే రహదారికి మరమ్మత్తులు చేయించి ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు.ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల భూములు, సహజ వనరులు, రాజ్యాంగబద్ధ హక్కులను పరిరక్షించడం ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొంటూ, ఏజెన్సీ ప్రాంత పరిరక్షణ కోసం సీపీఐ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి నిరంతర పోరాటాలు కొనసాగిస్తామని పాషా స్పష్టం చేశారు. మువ్వా వెంకటేశ్వర్లు అధ్యక్షతన ప్రారంభమైన రెండవ రోజు చైతన్య యాత్రలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం కల్లూరు వెంకటేశ్వరరావు, మేయర్ మూడు గణేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు పుల్లారెడ్డి, నరాటి ప్రసాద్, మున్నా లక్ష్మీకుమారి, చంద్రగిరి శ్రీనివాసరావు, కంచర్ల జమలయ్య, అడ్డగర్ల తాతాజీ ఉప్పుశెట్టి రాహుల్, ఎస్ కే ఫహిం, ఎస్వీఎస్ నాయుడు పేరాల శ్రీనివాస్, మారేడి శివాజీ కిలిమి ఎల్లారెడ్డి, బొల్లోజు వేణు, రత్నకుమారి, నూపా పోతయ్య నూపా తిరుపతిరావు పాల్వంచ రామారావు సాధన పల్లి సతీష్ కంభం మెట్టు శ్రీనివాస్ వామన రావు కోడి రెక్కల రాజారావు కోటి ముత్యాలరావు తాటిపూడి రమేష్, అమరవాది శంకర్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :