తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 17 తెలుగు వెలుగు) జూలూరుపాడు రేంజ్ అటవీ ప్రాంతంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో సాగులో ఉన్న జామాయిల్ ప్లాంటేషన్ చెట్లను అక్రమార్కులు రాత్రి పగలు తేడా లేకుండా పెద్ద పెద్ద చెట్లను నరికి తరలిస్తున్నారు దీనిపై అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం, పట్టించుకోకపోవడంపై పలు అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మండలంలోని గుండెపుడి, నల్లబండ్ల బోడు బీట్ పరిధిలో ప్రభుత్వ భూమి లో జామాయిల్ చెట్లను గురువారం కొందరు అక్రమంగా నరికి తరలిస్తుండగా గ్రామస్థులు గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీనితో సంఘటన స్థలికి వచ్చి న అటవీ శాఖ అధికారిని dro నాసూర్ బి జామాయిల్ కర్ర ను ఒక ప్రదేశంలో సీజ్ చేసి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది
Admin
తెలుగు వెలుగు టీవీ