తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండలం అనంతారం గ్రామంలో పత్తి, మిర్చి , వరి పంటలపై చీడపీడలు మరియు వైరస్ వంటి అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులకు అత్యాధునిక సాంకేతికతలు మరియు ఉత్తమ పద్ధతులపై అవగాహన కల్పించడం, వారి పంట దిగుబడులు మరియు ఆదాయాన్ని పెంచడమే మా లక్ష్యం అని .యుపిఎల్ వారి అధునాతన టెక్నాలజీతో కొత్త టెక్నికల్స్ అందుబాటులోకి వచ్చాయని వీటిని వినియోగించడం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడును పొందవచ్చునని . అలాగే మొక్కలపై ఔషధాలతో పాటు మొక్కలు అవసరమయ్యే న్యూట్రీ సన్స్ కూడా స్ప్రే చేయాలని. బిల్లు రహిత ఔషధములు వాడకూడదని సర్టిఫైడ్ కంపెనీ మందులనే వాడాలని. స్ప్రే చేసే సమయంలో మాస్కులు గ్లౌజులు వంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మార్కెటింగ్ హెడ్ మణికంఠేశ్వర్ రెడ్డి మరియు సౌత్ తెలంగాణ బిజినెస్ మేనేజర్ బి వాసుదేవా రెడ్డి మరియు టెరిటరీ మేనేజర్ సి నాగరాజు మరియు పరివాహ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ