తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచలోని శ్రీనివాసగిరి క్షేత్రాన్ని పర్యాటక పరంగా అద్భుతంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం జరిగిన శ్రీనివాస కళ్యాణంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఈ కొండను 'ఎకో టూరిజం' కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని స్పష్టం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ