తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మసూద్ అందించిన సేవలు చిరస్మరణీయం.కొత్తగూడెం పట్టణం ఒక ఉత్తమనాయకున్ని కోల్పోయింది.బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.సీనియర్ కాంగ్రెస్ నాయకులు మసూద్ మృతి కొత్తగూడెం పట్టణ ప్రజలకు తీరని లోటని, పట్టణ ప్రజలకు ఆయన అందించిన సేవలు ఎల్లప్పుడూ స్మరణీయంగా ఉంటాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందిన కొత్తగూడెం పట్టణం, గణేష్ బస్తీకి చెందిన షేక్ మసూద్ పార్థివ దేహాన్ని ఆయన సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం రూపంలో ఒక ఉత్తమ నాయకుడిని కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. పార్టీలకు అతీతంగా నివాళులర్పించిన ఆయన, ఇద్దరు పిల్లలున్న మసూద్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కాగా, ప్రస్తుతం మసూద్ భార్య జయంతి మసూద్ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 54వ డివిజన్ కార్పొరేటర్‌గా కొనసాగుతున్నారు. నివాళులరించినవారిలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, కార్పొరేటర్లు బోయిన విజయ్ కుమార్, బండి నర్సింహా, నాయకులు ఎండి యూసుఫ్, పల్లపోతు సాయి, పి సత్యనారాయణచారి, నయీమ్ ఖురేషి, ఇర్ఫాన్, ధన్ రాజ్, అస్మత్, ఇమ్రాన్ తదితరులు వున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ