Sunday, 02 August 2026 05:14:53 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

మేయర్‌ను కలిసిన ప్రకృతి ప్రేమికులు.

Date : 24 February 2026 08:34 PM Views : 207

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నూతనంగా ఎన్నికైన కొత్తగూడెం కార్పొరేషన్‌ మేయర్‌ మూడ్‌ గణేష్‌ను మంగళవారం ప్రకృతి ప్రేమికులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్పొరేషన్‌ కార్యాలయంలోని మేయర్‌ ఛాంబర్‌లో మేయర్‌ గణేష్‌ను ప్రకృతి హరితదీక్ష వ్యవస్థాపకులు, మన్‌కీ బాత్‌లో ప్రధాని మోడీచే ప్రశంసలు అందుకున్న గ్రీన్‌ గార్డెన్‌ వెహికిల్‌ సృష్టికర్త, సింగరేణియన్‌ మొక్కల రాజశేఖర్, ప్రకృతి హరిదీక్ష గౌరవ సభ్యులు శనగ కళ్యాణ్‌ కుమార్, ప్రకృతి హరితదీక్షకురాలు చిన్నారి నైనిక రజువా కలిసి మొక్కలను అందచేసి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మేయర్‌కు ప్రకృతి హరితదీక్ష ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ప్రతిరోజు కనీసం ఒక్క మొక్కనైనా నాటడమే లక్ష్యంగా ఈ దీక్ష చేపట్టడం జరిగింధని, రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు సైతం లభించాయని మొక్కల రాజశేఖర్‌ తెలిపారు. అనంతరం మేయర్‌ గణేష్‌ మాట్లాడుతూ ప్రకృతి పరిరక్షణ కోసం హరిదీక్ష చేపట్టడం ఎంతో అభినందనీయమని, తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. హరితదీక్షకురాలు నైనిక రజువాను ప్రత్యేకంగా అభినందిస్తూ శాలువా కప్పి సన్మానించారు. చిన్నతనం నుంచే మొక్కలు నాటడాన్ని అలవాటుగా చేసుకోవడం శుభపరిణామమని, నైనికను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని, భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దశరథ్‌ రజువా, మనోజ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :