Sunday, 02 August 2026 06:14:53 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

ఎస్ఐఆర్'లో బిఎల్ఏలు, పార్టీ శ్రేణులు క్రియాశీలకంగా పనిచేయాలి : సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా

Date : 21 July 2026 02:08 PM Views : 204

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి పారదర్శకమైన, తప్పుల్లేని ఓటరు జాబితాను రూపొందించాలి 18 ఏళ్లు నిండిన వారిని ఓటర్లుగా నమోదు చేయించాలి ఎన్నికల అధికారులకు బిఎల్ఏలు పూర్తి సహకారం అందించాలి : సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా ఎస్ఐఆర్ ప్రక్రియలో పార్టీ శ్రేణులు, బిఎల్ఏలు క్రియాశీలకంగా పనిచేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా పిలుపునిచ్చారు. పారదర్శకమైన, తప్పుల్లేని ఓటరు జాబితా రూపకల్పనకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు అవగాహన కల్పించేందుకు సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి ఆధ్వర్యంలో మంగళవారం చుంచుపల్లి మండల పరిధిలోని గౌతంపూర్, రుద్రంపూర్, పెనగడప గ్రామాల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సులకు ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ కె సాబీర్ పాషా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన సాధనమని, అర్హులైన పౌరులెవరూ ఓటరుగా నమోదు కాకుండా ఉండిపోకూడదని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయించడమే కాకుండా, ప్రస్తుతం ఉన్న ఓటర్ల ఓటు హక్కు రద్దు కాకుండా బిఎల్ఏలు (బూత్ లెవల్ ఏజెంట్లు) ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. ఓటర్ల జాబితాలోని తప్పుల సవరణ, మరణించిన వారి పేర్ల తొలగింపు, చిరునామాల మార్పు వంటి అంశాలను బిఎల్ఏలు నిరంతరం పర్యవేక్షిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న బిఎల్ఓలు, ఎన్నికల సిబ్బందికి పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచి సహకరించాలని కోరారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను వేగవంతం చేసి, పారదర్శకమైన జాబితా తయారీ ద్వారానే ప్రజాస్వామ్యం మరింత పరిపుష్టమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ అవగాహన సదస్సుల్లో మేయర్ మూడ్ గణేష్, నాయకులు సలిగంటి శ్రీనివాస్, వాసిరెడ్డి మురళి, గానగళ్ల వీరాస్వామి, వట్టికొండ మల్లికార్జున్ రావు, తోట రాజు, కె రాములు, నీడలా సుధాకర్, వెంకన్న, కట్ట ఉదయ్, జగదాంబ, తాజుద్దీన్, సర్పంచ్ కళ్యాణి, సీతారాములు, బివి రమణ, బండారి మల్లయ్య, లక్ష్మణ్, గంగారాం, కొవ్వూరి రాజేశ్వరరావు, గుడిపూడి రవి, జోసెఫ్, బిక్షపతి, గిరిజాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :